Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి రైతు యాత్రపై స‌ర్కారు భారీ స్కెచ్‌!!

By:  Tupaki Desk   |   14 Oct 2022 2:29 AM GMT
అమ‌రావ‌తి రైతు యాత్రపై స‌ర్కారు భారీ స్కెచ్‌!!
X
అమ‌రావ‌తి రైతులు చేస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0కు వైసీపీ నేత‌ల నుంచి.. ప్ర‌భుత్వం నుంచి కూడా.. అడ్డంకులు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిని అడ్డుకుని తీరుతామ‌ని.. ఇప్ప‌టికే.. మంత్రులు స‌హా.. వైసీపీ కీల‌క నాయ‌కులు కూడా ప్ర‌క‌టించారు. అయినా.. కూడా.. రైతులు.. హైకోర్టు నుంచి అనుమ‌తులు తెచ్చుకుని.. త‌మ పాద‌యాత్ర‌ను సాగిస్తున్నారు. వాస్త‌వానికి.. మూడు రాజ‌ధానుల జ‌పం చేస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం.. పాద‌యాత్ర‌కు అనుమ‌తించ‌ని విష‌యం తెలిసిందే.

తొలిద‌ఫా.. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు.. మ‌లి ద‌ఫా.. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు .. రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం ఎప్పుడూ.. అనుమ‌తించ‌లేదు. గ‌తంలోనూ.. ఇప్పుడ కూడా.. న్యాయ‌స్థానం నుంచి వ‌చ్చిన అనుమ‌తుల‌తోనే వారు ముందుకు క‌దిలారు. అయినా.. కూడా.. ఎక్క‌డ కుదిరితే.. అక్క‌డ‌.. ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న ప్ర‌భుత్వం.. పార్టీనాయ‌కులు కూడా రైతుల‌ను అడ్డ‌గించే ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు.

తాజాగా.. మ‌హాపాద‌యాత్ర 2.0 ప్ర‌స్తుతం అనేక అడ్డంకుల‌ను.. వైసీపీ నేత‌ల క‌వ్వింపుల‌ను దాటుకుని.. గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌శాంతంగా ముందుకు సాగుతోంది. అయితే.. అడ్డుకోవాల‌ని వైసీపీ నాయ‌కులుచేస్త‌న్న ప్ర‌య‌త్నాలు.. విఫ‌ల‌మ‌వుతున్నాయి.

ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రో ప్ర‌ధాన అడ్డంకి ఎదురైంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను క‌లిపే.. రాజ‌మండ్రి రోడ్ క‌మ్ రైల్ బ్రిడ్జి ని ప్ర‌భుత్వం తాత్కాలికంగా మూసేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

అత్య‌వ‌స‌ర మ‌ర‌మ్మ‌తులు చేయాల్సి ఉన్నందున‌.. బ్రిడ్జిని మూసేస్తున్న‌ట్టు.. క‌లెక్ట‌ర్ రాత్రికి రాత్రి ప్ర‌క టించారు. నిజానికి పాద‌యాత్ర ఈ నెల 17న రాజ‌మండ్రిలోకి ప్ర‌వేశించాలి. దీనికి ప్ర‌ధాన మార్గం.. రాజ‌మండ్రి వార‌ధే! అయితే.. ఇప్పుడు దీనిని మూసివేస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు.

శుక్ర‌వారం నుంచి వారం రోజుల పాటు మూసివేస్తున్న‌ట్టు తెలిపారు. మ‌రి ఇప్ప‌టికిప్పుడు అంత అర్జంటుగా.. మూసేసి మ‌రీ మ‌ర‌మ్మ‌తులు చేయాల్సిన అవ‌స‌రం ఏంటో స‌ర్కారుకే తెలియాలి. ఎలా చూసుకున్నా.. ఇది రైతుల పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డంలో ప్ర‌ధాన భాగ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇదిఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.