Begin typing your search above and press return to search.

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు...కొత్త రూల్స్ ఇవే !

By:  Tupaki Desk   |   12 Jun 2020 11:30 AM GMT
ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు...కొత్త రూల్స్ ఇవే !
X
ఆంధ్రప్రదేశ్‌ లో జూలై 8న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. నవరత్నాలు ,పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు ఇళ్ల స్థలాలకి అర్హులైన 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నారు. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి ఆగస్ట్ 14న ఇళ్లు నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టనున్నారు. అలాగే ఈ ఇళ్ల స్థలాల కోసం మొత్తం 42,920 ఎకరాల భూములు అవసరం కానున్నాయి.

ఈ పథకం కోసం ఏపీ సర్కార్ 25,842 ఎకరాల ప్రభుత్వ భూములు, 16,078 ఎకరాల ప్రైవేటు భూములను వినియోగించనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 16 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు లే ఔట్స్ వేసింది ప్రభుత్వం. 2023 నాటికి రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం జగన్ టార్గెట్ ‌గా పెట్టుకున్నారు. అయితే, కేటాయించిన ఇళ్ల స్థలాలను విక్రయంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జీవో 99లో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు.

నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ స్థలాన్ని లబ్దిదారులు విక్రయించడానికి వీల్లేదు. ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాత లబ్ధిదారులు ఆ ఇంట్లో కనీసం ఐదేళ్లు నివసించిన తర్వాత మాత్రమే దాన్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కండిషన్ల మీద ఆధారపడి ఉంటుంది.

నిబంధనలు:

ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ స్థలాన్ని లబ్ధిదారులు విక్రయించడానికి వీల్లేదు
ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాత లబ్ధిదారులు ఆ ఇంట్లో కనీసం ఐదేళ్లు ఉండాలి
అలా నివసించిన తర్వాత మాత్రమే దాన్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది
అమ్మేటప్పుడు కూడా పలు కండీషన్‌లను పాటించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.