Begin typing your search above and press return to search.
స్కూళ్లు , కాలేజీలకి కీలక ఆదేశాలు జారీచేసిన ఏపీ సర్కార్ !
By: Tupaki Desk | 31 Oct 2020 8:40 PM ISTప్రైవేటు స్కూళ్లు, కాలేజీలని తెరవడం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020, నవంబర్ 02వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహించనుంది. ఇందుకు మార్గదర్శకాలను రూపొందించింది. నవంబర్ 2 నుంచి రాష్ట్రంలో డిగ్రీ, పీజీ తరగతులను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో యూనివర్సిటీలు, కళాశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇక స్కూల్ కి వచ్చే విద్యార్ధులకి ,టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో తరగతి గదిలో కేవలం 16 మంది మాత్రమే ఉండాలని , అలాగే 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. రోజు విడిచి రోజు తరగతుల నిర్వాహణ, ఆన్ లైన్, ఆఫ్ లైన్ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో రూపొందించారు. నవంబర్ నెలంతా ఒక్కపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటాయి. 10వ తరగతి చదివే వారికి ప్రతి రోజు తరగతులు ఉంటాయి. నవంబర్ 23వ తేదీ నుంచి 6, 8 తరగతులకు ఒక రోజు, 7, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. డిసెంబర్ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలని తెలిపింది.
టీచర్లు మాత్రం ప్రతి రోజు స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంటుంది. నవంబర్ 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్ ఉంటుంది. విద్యార్ధుల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి. మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలని తెలిపింది. ఉదయం స్కూళ్లు తెరవగానే కోవిడ్ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి. . విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో వారంలో 6 రోజుల పాటు తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఒక వేళ వీక్ డేస్ లో సెలవు ఇవ్వాల్సి వస్తే రెండో శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహించాలని సూచించింది.