Begin typing your search above and press return to search.

భక్తులకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ !

By:  Tupaki Desk   |   1 Jun 2020 5:30 AM GMT
భక్తులకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ !
X
ఆంధ్రప్రదేశ్ లోని భక్తులకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు వెళ్లాలనుకునే వారు అక్క‌డ ఉండ‌టానికి కావాల్సిన‌ అద్దె గదులను , అలాగే స్వామి వారు సేవా టికెట్స్ ను గ్రామ, వార్డు సచివాలయాలలోనే అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకునే వీలును కల్పించింది. దీనితో ఇకపై శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు సంబంధించిన స్వామి వారి సేవా టికెట్లను ముందస్తుగా మీ ఊర్లోని సచివాలయాలలోనే బుక్ చేసుకోవచ్చు.

ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే…గ్రామ‌, వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని అన్ని ఫ్యామిలీల‌కు వాట్సాప్‌ మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మూసేసి ఉన్న పాముల ఆలయాలు అన్ని కూడా జూన్‌ 8వ తేదీ నుంచి దర్శనాలు తిరిగి ప్రారంభించ‌డానికి కేంద్ర ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని దేవాల‌యాల‌కు సంబంధించిన అధికారులు ఇప్పటికే భక్తులకి దర్శనం చేయించడం పై కసరత్తు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా, లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ద‌ర్శ‌నం చేసుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

కాగా ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలలో మొత్తం 540 రకాల సర్వీసెస్ పొందేందుకు గ‌వ‌ర్న‌మెంట్ తగిన ఏర్పాట్లు చేసింది. సచివాలయం ద్వారా ఏయే సేవలు పొందవచ్చో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వాట్సాప్‌ ద్వారా స‌మాచారం చేర‌వేస్తారు. వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల అందరి ఫోను నంబర్లతో ఒక వాట్సాప్‌ గ్రూపును క్రియేట్ చేస్తారు. గ‌వ‌ర్న‌మెంట్ ప‌థ‌కాలతో పాటు ప్ర‌తి స‌మాచారం ఈ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా కూడా అందరికీ తెలియజేస్తారు.