Begin typing your search above and press return to search.

ఐపిఎల్ అభిమానులకు పెద్ద షాక్..డ్రీమ్11పై నిషేధం

By:  Tupaki Desk   |   29 Sept 2020 6:30 PM IST
ఐపిఎల్ అభిమానులకు పెద్ద షాక్..డ్రీమ్11పై నిషేధం
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలవ్వడంతోనే దేశంలో క్రికెట్ ఫీవర్ వచ్చేసింది. అంతేకాదు.. మ్యాచ్ లు వరుసగా టై అవుతూ పోటాపోటీగా సాగుతుండడంతో క్రికెట్ అభిమానుల్లో జోష్ పెరిగిపోతోంది. దీనికి ఆదరణ బాగా వస్తోంది. ఇక ఐపీఎల్ ఆటతోపాటు దేశంలో బెట్టింగ్ కూడా జోరందుకుంది. నిజానికి ఐపీఎల్ స్పాన్సరర్ గా ఇప్పుడు డ్రీమ్ 11 ఉంది. ఇది భారతదేశంలోనే ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. ఈ స్పోర్స్ యాప్ లో పందెం వేయడం ద్వారా చట్టబద్ధంగా నిజమైన నగదును గెలుచుకోవచ్చు. డ్రీమ్ 11 దేశం నలుమూలల నుండి భారీ సంఖ్య వినియోగదారులను కలిగి ఉంది. ప్రజలు ఈ డ్రీమ్ 11 యాప్ లో క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ మరియు ఇతర క్రీడలను ఆడవచ్చు.

అయితే, తెలంగాణతో సహా కొన్ని దేశంలోని రాష్ట్రాల్లో ఈ యాప్ నిషేధించబడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తాజాగా గేమింగ్ చట్టాలను మార్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలలో మార్పు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డ్రీమ్ 11 యాప్ నిషేధించబడింది. ఈ ఉదయం అందరికీ ఇది భారీ షాక్‌గా పరిణమించింది. ఐపీఎల్ ఫ్యాన్స్ ను ఇది తీవ్రంగా నిరాశపరిచింది.

ప్రస్తుత ఐపిఎల్ సీజన్ ప్రారంభం కావడంతో డ్రీమ్ 11పై జోరుగా ఆడేస్తున్నారు. తెలంగాణ ఇప్పటికే ఈ యాప్స్ పై నిషేధం విధించగా.. తాజాగా ఎపి ప్రభుత్వం కూడా ఈ యాప్ పై నిషేధం విధించేదని మీడియాలో వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు ఈ డ్రీమ్ 11 యాప్ లలో ఇప్పటికే ఫాంటసీ క్రికెట్ ఆడటం ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక చర్య ఇప్పుడు వారిని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేసింది.

డ్రీమ్ 11 మాదిరిగానే పేటిఎం గేమ్స్ ను కూడా ఆంధ్రప్రదేశ్ లో నిషేధించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నిషేధించబడిందని వినియోగదారులకు సందేశాన్ని పంపించారు. "రాష్ట్ర చట్టాల ప్రకారం వర్తించే విధంగా, నగదుపై ఫాంటసీ స్పోర్ట్స్ ఆడటం ఏపీలో నిషేధం. డ్రీమ్ 11 కూడా ఏపీలో నిషేధించబడింది. ఆంధ్రప్రదేశ్ చట్టాలలో మార్పు వల్ల డ్రీమ్ 11 లో చెల్లింపు పోటీలను ఆడకుండా వినియోగదారుల జాగ్రత్త పడాలని ప్రభుత్వం తెలిపింది.