Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల రద్దుపై హైకోర్టులో ఏపీ సర్కార్ అఫిడవిట్

By:  Tupaki Desk   |   26 Nov 2021 5:30 PM GMT
మూడు రాజధానుల రద్దుపై హైకోర్టులో ఏపీ సర్కార్ అఫిడవిట్
X
మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుకెక్కింది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం కీలక అఫిడవిట్లను సమర్పించింది. పాలన వికేంద్రీకరణ రద్దు, సీఆర్.డీఏ రద్దు చట్టాలపై అఫిడవిట్లను ప్రభుత్వం తరుఫున పురపాలక శాఖ హైకోర్టులో దాఖలు చేసింది.

ఈ అంశాలపై గతంలో పిటీషన్ దాఖలు చేసిన వారికి అఫిడవిట్ల కాపీలను ప్రభుత్వం పంపింది. ఈనెల 22న అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్.డీఏ బిల్లు చట్టాన్ని ఉపసంహరించుకొని బిల్లులు ఆమోదించినట్టు ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. ఇదే బిల్లులను ఈనెల 23న శాసనమండలిలో కూడా ఆమోదించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈనెల 22న వికేంద్రీకరణ బిల్లుపై అభిప్రాయం చెప్పాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అఫిడవిట్ లను దాఖలు చేసినట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. రెండు బిల్లుల కాపీలను అఫిడవిట్ లతో జతచేసి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ హైకోర్టుకు సమర్పించారు.

ఈ చట్టాలను అసెంబ్లీలో ఉపసంహరించుకున్నట్లు మాత్రమే కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లును చట్టసభల్లో ఆమోదించారు కాబట్టి తగు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది.