Begin typing your search above and press return to search.

పాపికొండలు పర్యాటకం పై కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   11 Nov 2019 10:36 AM GMT
పాపికొండలు పర్యాటకం పై కీలక నిర్ణయం
X
తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద పడవ మునిగి 40 మంది కి పైగా జలసమాధి కావడం.. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపడం తెలిసిందే. అయితే అప్పటి వరకు ఫేమస్ అయిన పాపి కొండలు పర్యాటకం పడవ ప్రమాదం.. అంతమంది చని పోవడం తో పూర్తిగా ఆగి పోయింది. ఎంతో సుందర మనోహరమైన ఈ పాపి కొండల యాత్రకు బ్రేక్ పడింది.

మరి ఈ ప్రకృతి అందాలను ఇక చూడలేమా అని బాధ పడుతున్న పర్యాటకులకు ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాపికొండలు పర్యాటకాన్ని పూర్తి భద్రతతో నిర్వహించడానికి సమాయత్తమవుతోంది.

రెండు నెలలు గా పాపికొండలు జల విహారానికి బ్రేక్ వేసిన వైసీపీ సర్కారు.. ఇప్పుడు మునిగిన బోటును వెలికి తీయడం తో ప్రైవేటు వ్యక్తుల ను పాపి కొండల విహారానికి పూర్తిగా దూరం పెట్టాలని నిర్ణయించింది. టూరిజం శాఖ ఆధ్వర్యం లోనే ఇక పై బోటు షికారు ఏర్పాట్లు చేస్తోంది. ఖచ్చితం గా పరిమితి కి లోబడి ప్రయాణికులు.. వారికి లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్ లతోపాటు బోటు అనుకూలత, కండీషన్ పరీక్షించిన తర్వాతే అధికారులు ఈ పాపి కొండల విహారయాత్ర ను ప్రారంభించడానికి చూస్తున్నారు.

ప్రస్తుతానికి పాపి కొండల విహారానికి సర్కారే బోట్లను సిద్ధం చేస్తోంది. 83 బోట్లను పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక బోటింగ్ ప్రాంతం లో గోదావరి చుట్టు పక్కల ఆరు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి, పోశమ్మ గండి, దేవీ పట్నం, సింగన్న పల్లి, పేరంటాల పల్లి, పోచవరం వద్ద కంట్రోల్ రూంలు పర్యాటకుల కు సాయం చేయనున్నాయి. రూట్ మ్యాప్ సిద్ధం చేశాకా బోటు షికారు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.