Begin typing your search above and press return to search.

ఏపీ ఉద్యోగ సంఘాల తర్జన భర్జన

By:  Tupaki Desk   |   3 Jan 2022 3:38 PM GMT
ఏపీ ఉద్యోగ సంఘాల తర్జన భర్జన
X
ఏపీలో ఉద్యోగ సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పీఆర్పీ పీటముడి వీడకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. వేర్వేరుగా సమావేశమైన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాల పడుతున్నారు. వేర్వేరు సమావేశాల అనంతరం సంయుక్తంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేయనున్నాయి రెండు జేఏసీలు..

గత నెలలో ఎక్కడ ఉద్యమాన్ని వాయిదా వేశారో అక్కడి నుంచే ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రారంభించనున్నాయి. నిరసన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలా? లేక సంక్రాంతి తర్వాత రంగంలోకి దిగాలా? అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నాయి. ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందనే భావన ఉద్యోగ సంఘాల్లో కనిపిస్తోంది.

పీఆర్సీకి సంబంధించి పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు అసహనానికి గురవుతున్నాయి. ఉద్యోగ సంఘాల తీరుపై ఉద్యోగులు సైతం కోపంగా ఉన్నారని తెలుస్తోంది. పదే పదే చర్చల పేరుతో ఆహ్వానించడం.. విభజించి పాలించు అన్న రీతిన వ్యవహరించడం ఉద్యోగ సంఘాలకు మింగుడుపడడం లేదు. చర్చలు జరిపినా ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉండడం.. ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై చర్చ సాగుతోంది.

ఈసారి తమ సమస్యల పరిష్కానికి మొండి పట్టుదలతో ఉన్న జగన్ సర్కార్ ను ఎలా ఒప్పించాలా? అని ఉద్యోగ సంఘాలు సమాలోచనలు జరుపుతున్నారు. ఉద్యమానికి రెడీ అయితే ప్రభుత్వంతో చెడుతుందా? సమస్యలు పరిష్కారం అవుతాయా? అని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.