Begin typing your search above and press return to search.

వారి మంటకు భోగీ మంట కలిసొచ్చిందే... ?

By:  Tupaki Desk   |   14 Jan 2022 10:39 AM GMT
వారి మంటకు భోగీ మంట కలిసొచ్చిందే... ?
X
అసలే మండిపోతున్నారు. అంతన్నారు, ఇంతన్నారు, నెలల తరబడి ఎదురుచూసేలా చేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి సమక్షంలో పీయార్సీ ఖరారు అయింది. చిత్రమేంటి అంటే అది ఇంటీరియమ్ రిలీఫ్ కంటే కూడా తక్కువగా ఉంది. ఒక విధంగా ఆశ పెట్టి తుస్సుమనిపించారు అన్నదే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆవేదన. ఇంతకు ముందు ఎపుడూ ఇలా జరగలేదు. అందుకే దీనికి రివర్స్ పీయార్సీ అని పేరు పెట్టారు. ఇక పీయార్సీ ప్రకటనకు ముందు కలసికట్టుగా పటిష్టంగా ఉన్న ఉద్యోగ సంఘాల జేఏసీలో కుంపట్లు పెట్టేసింది ఈ కొత్త పీయార్సీ.

అదేంటో పీయార్సీ. ఏమీ అర్ధం కావడంలేదు, గందరగోళంగా ఉంది అంటూ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నుంచి బయటకు వచ్చి మరీ ఆందోళనను స్టార్ట్ చేశాయి. ఉపాధ్యాయ సంఘాల సమితి ఫ్యాఫ్టో తన నిరసనను భోగీ పండుగ సాక్షిగా మరింత రెట్టింపు చేసింది. ఏకంగా భోగీ మంటల్లోనే పీయార్సీ నివేదికను ఉపాధ్యాయ సంఘాలు పడేసి తగలబెట్టడం ప్రభుత్వం మీద వారు పోరు ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది.

విజయవాడలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఫ్యాఫ్టో ప్రతినిధులు ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. పీయార్సీ నివేదిక పూర్తి అసంబద్ధంగా ఉందని కూడా పేర్కిన్నారు. ఫ్యాఫ్టో మాజీ చైర్మన్ పి బాబురెడ్డి దీని మీద మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పీయార్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయడం విశేషం.

అసలు పీయార్సీ మీద నిజానికి ప్రభుత్వానికి అందిన ఆశుతోష్ మిశ్రా నివేదిక ఏంటో బయటపెట్టాలని కూడా ఆయన కోరారు. ఇక రాష్ట్ర పీయార్సీ స్థానంలో కేంద్ర ప్రభుత్వ పీయార్సీని అమలు చేస్తామని చెప్పడం కూడా మంచి విధానం కాదని, దాన్ని విరమించుకోవాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. అంతే కాదు, పాత హెచ్ ఆర్ ఏ రేట్లు అలాగే కొనసాగించాలని గట్టిగా కోరారు

ఇక సీపీఎస్ ని రద్దు చేయాలని, తాము కోరుకున్నట్లుగా అన్ని రకాలైన డిమాండ్లను పరిష్కరించాల్సిందే అని వారు పేర్కోండం విశేషం. ఇదే విధంగా సచివాలయ ఉద్యోగులను మాస్టర్ స్కేల్ పరిధిలోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పండుగ రోజు కూడా ప్రభుత్వాన్ని పరేషన్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. భోగీ మంటలను సాక్షిగా చూపిస్తూ తమ ఆవేశాన్ని చూపించాయి.

దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాలి. ఏకంగా పీయార్సీ నే రద్దు చేయమండం అంటే కొత్త డిమాండే. ఒక ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరమైన పరిణామమే. ఇపుడే ఇలా ఉంటే పండుగ తరువాత తమ ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్న క్రమంలో ప్రభుత్వానికి ముందు ముందు ఇది పెను సవాల్ గా మారుతుంది అంటున్నారు.