Begin typing your search above and press return to search.
డీఎస్సీపై అనిశ్చితి.. ఆందోళనలో అభ్యర్థులు
By: Tupaki Desk | 7 Feb 2020 11:48 AM ISTప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది ప్రతి నిరుద్యోగి కల ఉంటుంది. దీనికోసం పగలురాత్రి కష్టపడి చదువుతుంటారు. అలాంటి వారికి ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు వేలపై లెక్క పెట్టే సంఖ్యలో విడుదల చేస్తాయి. ఆ విడుదల చేసిన ఉద్యోగాలు ఏళ్ల తర్వాత భర్తీ అవుతాయి. కోర్టు కేసులు, పేపర్ లీకేజ్, వాయిదాలు తదితర కారణాలతో ఆ ఉద్యోగాల భర్తీ తీవ్ర కాలయాపన అవుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీలోని డీఎస్సీకి ఏర్పడింది. 2018లో అప్పటి ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకులాలు, మోడల్ స్కూళ్లు తదితర అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 7,902 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ పై కొందరు పలు అంశాల పై కోర్టులను ఆశ్రయించారు. ఆ కోర్టుల్లో విచారణ సాగి కొన్ని కేసులు పరిష్కారం కాగా.. మరికొన్ని చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి.
అయితే ఈ లోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం 2018 డీఎస్సీని కొనసాగిస్తుందా? లేదా? దీన్ని రద్దు చేసి మళ్లీ కొత్తగా ప్రకటన విడుదల చేస్తుందా అని తెలియడం లేదు. ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో లక్షలాది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం రాక.. ఇంట్లో ఖాళీగా ఉండలేక సతమతమవుతున్నారు. కోర్టు కేసుల కారణంగా ఈ పోస్టుల భర్తీ కాలయాపన అవుతోంది. ప్రభుత్వం ఈ డీఎస్సీ విషయంలో ఎన్నో సార్లు పరీక్షలు, ఫలితాల షెడ్యూల్ మార్చడం తో అసలు ఈ పరీక్ష పెడతారో లేదో తెలియడం లేదు. ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తే త్వరలోనే మరో నోటిఫికేషన్ వేయడానికి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డీఎస్సీ 2018ని రెండేళ్లయినా పూర్తి చేయకపోవడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విద్యా విధానంపై తీవ్ర దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ పోస్టులు భర్తీ అయితే డీఎస్సీ-2020 నోటిఫికేషన్ వేయడానికి అధికారుల యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
మొత్తంగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2018 డీఎస్సీని రద్దు చేసి మొత్తం ఖాళీలను కలిపి 2020 డీఎస్సీ వేస్తుందనే చర్చ సాగుతోంది. ఇదే గనుక జరిగితే 2018 నోటిఫికేషన్ వాళ్లకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. వారి వయసు అయి పోవడం, మళ్లీ కొత్త ప్రిపరేషన్ మొదలుపెట్టడం తదితర కారణాలతో వారు ఈ పోస్టులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే 2018 నోటిఫికేషన్ ను పూర్తి చేసి కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాలి.