Begin typing your search above and press return to search.
ధరలు తగ్గించిన తర్వాత ఏపీలో మందుబాబులు ఏం చేశారంటే?
By: Tupaki Desk | 20 Dec 2021 4:54 AM GMTవిన్నంతనే చుక్కలు కనిపించేలా ఉంటాయి ఏపీలోని మధ్య ధరలు. మద్యం తాగే అలవాటును ప్రజల్లో తగ్గించటం కోసం వాటి ధరల్ని భారీగా పెంచేసినట్లుగా ఏపీ సర్కారు చెప్పటం తెలిసిందే. మద్యం తాగే అలవాటును తగ్గించటం కోసం ధరలు భారీగా పెంచేసే లాజిక్ ఏమిటో ఎంతకూ అర్థం కాని విషయమే అయినా.. దాన్నే ఫాలో అవుతున్న జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా తాజాగా కొన్ని బ్రాండ్ల ధరల్ని భారీగా తగ్గించేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ఇంతకాలం ఏపీ సర్కారు చెప్పిన వాదనకు భిన్నంగా ధరల్ని తగ్గించటంలో లాజిక్ ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాదు. అయితే.. ఇలాంటి వాదనల్ని పట్టించుకోకుండా తాము అనుకున్నట్లే ధరల్ని తగ్గించేసిన జగన్ సర్కారు నిర్ణయంతో ఏపీలోని మందు బాబులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇంతకాలం ధరల బాదుడితో హాహాకారాలు పెడుతున్న వారు.. తాజా నిర్ణయంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. మద్యం ధరల్ని తగ్గించిన వైనంపై వారు పాజిటివ్ గా స్పందించారు. అంతేకాదు.. మద్యం దుకాణాల వద్దకు పోటెత్తారు.
మద్యం అమ్మకాల్ని పెంచుకోవటం కోసమే.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారీ ఎత్తున అమ్మకాలు సాగటమే కాదు.. మద్యానికి పెద్ద ఎత్తున బానిసలు కావటం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. మద్యం ధరల్ని తగ్గిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో.. మందుబాబులు పొద్దుపొద్దున్నే.. మద్యం దుకాణాల వద్ద హారతికర్పూరం.. కొబ్బరికాయలు తీసుకొచ్చి పూజలు చేయటం.. దండాలు పెట్టటం లాంటి విచిత్రమైన పనులు చేశారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మందుబాబులు మద్యం షాపుల వద్దకు వెళ్లి పూజలు నిర్వహించారు. మద్యం దుకాణానికి హారతులు ఇచ్చారు. ఆహా.. ఓహో అంటూ పాటలు పాడి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇలా చేసిన కొందరి సందడి చూసి.. మిగిలిన మందుబాబులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన వైనం చూసినోళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.