Begin typing your search above and press return to search.
ఎందుకు అలా చేశామో చెప్పేసిన ఏపీ డీజీపీ
By: Tupaki Desk | 26 Jan 2017 11:09 PM ISTఏపీకి ప్రత్యేక హోదా కోరూతూ విశాఖలోని ఆర్కే బీచ్ లో గళం విప్పే ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్డుకున్న అనంతరం ఏపీ డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదని తెలిపిందని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటమే మా బాధ్యత అని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు శాంతిని కాపాడటంలో సక్రమంగా విధులు నిర్వహించారని తమకు ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకత లేదని డీజీపీ స్పష్టం చేశారు. తిభద్రతల దృష్ట్యా పోలీసులకు సహకరించిన రాష్ట్ర ప్రజలకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా...ఈనెల 28 తర్వాత ఎవరైనా దరఖాస్తు చేస్తే.. పరిశీలించి అనుమతిస్తామని డీజీపీ సాంబశివరావు వివరించారు.
ఇదిలాఉండగా.... విశాఖలోని ఆర్కే బీచ్‌లో పలువురు ఆందోళనకారులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా కోరుతూ ఆర్కే బీచ్‌లో నినాదాలు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేయడంపై విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగానంద్ మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఆందోళనలకు అనుమతి లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు వివరించామని తెలిపారు. ప్రతిపక్షనేత తిరిగి హైదరాబాద్ వెళ్లపోయారన్నారు. ఈ క్రమంలో విపక్ష నేతకు ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చామని సీపీ యోగానంద్ తెలిపారు. అనుమతి లేనప్పటికీ ఆందోళనలు చేపట్టడం ద్వారా కొందరు నిబంధనలు ఉల్లంఘించారని దీంతో 500 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/