Begin typing your search above and press return to search.
వైరల్ గా మారిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో !
By: Tupaki Desk | 1 Jan 2020 4:34 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణికి సీఎం జగన్ అంటే ఎనలేని అభిమానం. ఆమె రాజకీయాలలోకి రాకముందు నుండి జగన్ పై అభిమానం పెంచుకున్నఉప ముఖ్యమంత్రి తన కుడి చేతిపై వైఎస్ జగన్ పేరును పచ్చబొట్టుగా వేసుకున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పని చేసిన పుష్ప శ్రీవాణి భర్త ప్రోత్సాహం తో రాజకీయాల్లోకి వచ్చి కురుపాం అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు. 27 సంవత్సరాల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికైన పుష్ప శ్రీవాణి 31 ఏళ్ల వయస్సుకే మంత్రి పదవి దక్కించుకున్నారు. . చాలా చిన్న వయస్సులోనే ఎస్టీ కోటాలో పుష్ప శ్రీవాణికి మంత్రి పదవి దక్కింది. సీఎం జగన్ ఏ నమ్మకం పెట్టుకొని ఆమెకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారో .. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేటాయించిన శాఖలో పుష్ప శ్రీవాణి అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం పిల్లలు , పెద్దలు అన్న తేడా లేకుండా టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ మరో ప్రపంచం తెలియకుండా గడిపేస్తున్నారు. కొంతమంది టిక్ టాక్ కే అంకితమైపోయారు అంటే ఎంతగా ఈ టిక్ టాక్ అందరిని ఆకట్టుకుంటుందో ఆలోచించండి. దీనితో ఈ టిక్ టాక్ లోకి మన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల ముందు సింగర్ మంగ్లీ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ అన్న అనే పాట పాడారు. ఆ పాట ప్రస్తుతం టిక్ టాక్ లో వైరల్ గా మారింది. సీఎం జగన్‌ను పొడుగుతూ టిక్ టాక్‌లో హల్ చల్ చేస్తున్న ఈ సాంగ్‌ను అనుకరిస్తూ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో చేశారు.
16 సెకెన్ల పాటు నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో కొనసాగుతుంది. వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతోంది. సీఎం జగన్ ను ప్రశంసించేలా ఉన్న పాటకు పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో చేయటంపై వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి టిక్ టాక్ వీడియోలో అదరగొట్టారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.