Begin typing your search above and press return to search.

అరెరే ..ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు

By:  Tupaki Desk   |   10 March 2021 9:31 AM GMT
అరెరే ..ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు
X
ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా , పోలింగ్ సాఫీగా సాగిపోతుంది. ఇక చివరి వరకు ఎంతో ఉత్కంఠత రేకెత్తించిన ఏలూరు కార్పోరేషన్‌ ఎన్నికలకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో , అక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఓటర్ల జాభితా లో ఎన్నో ఫిర్యాదులు రావడంతో ఎన్నికలు ఆపాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేస్తే , చివర్లో మళ్లీ ఎన్నికలకి ఆమోదం తెలిపింది.

ఆ ఎన్నికల జాబితాలో అక్రమాల వ్యవహారం ఇప్పుడు స్ధానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఆళ్లనానికి కూడా చేదు అనుభవాన్ని మిగిల్చించి. ఈ రోజు ఏలూరు కార్పోరేషన్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు శనివారపుపేటలోని పోలింగ్‌ బూత్ ‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్‌ బూత్‌ కు వెళ్లి ఓటు వేసేందుకు సిద్ధమైన సమయంలో ఆయన ఓటు లేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. అదే విషయాన్నిడిప్యూటీ సీఎం నానికి తెలిపారు. దీనితో తో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అయిన తన ఓటే గల్లంతు కావడం ఏంటని వారిని నిలదీశారు. ఆ తర్వాత చేసేదేమి లేక పోలింగ్ బూత్ నుండి ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఏలూరు కార్పోరేషన్‌ ఎన్నికల ఓటర్ల జాబితా తయాతీలో పలు అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ ఎన్నికలు నిలిపేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు తిరిగి ఎన్నికలకు డివిజన్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చింది. అయితే , ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నా,ఏలూరు ఎన్నికల ఫలితం మాత్రం ఎప్పుడు వేలువడాలో మళ్ళీ హైకోర్టు చెప్పాల్సిందే . ఈ కేసును నిన్న 23వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.