Begin typing your search above and press return to search.
కలెక్టర్లకు తిట్ల డ్యూటీనా జగనన్నా?!
By: Tupaki Desk | 28 Dec 2022 10:00 AM IST``కలెక్టర్లూ ప్రెస్‌మీట్లు పెట్టండి..గట్టిగా తిట్టండి..!`` అని సాక్షాత్తూ ఏపీ సీఎం జగన్ పిలుపునివ్వడం పట్ల నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు. ``ఇప్పటి వరకునేతలు తిడుతున్నది సరిపోవడం లేదా.. జగనన్నా.. ఇక, కలెక్టర్లను దింపేస్తున్నారు`` అని కామెంట్లుకుమ్మరిస్తున్నారు. నిజానికి ఏపీలో ఉన్న వైసీపీ నాయకులను పరిశీలిస్తే.. చాలా మంది నోరు విప్పితే ఏం మాట్లాడుతున్నారో అర్దం కావడం లేదు. ఏకంగా ఒక మాజీ మంత్రికి `బూతుల మంత్రి`గా పేరొంది. మరొకరు.. అసెంబ్లీలోనే రెచ్చిపోయి మాట్లాడారు.
ఇక, నియోజకవర్గాల స్థాయిలో సీనియర్ నాయకులు.. రెచ్చిపోతున్న విధానం తెలిసిందే. ఇలా.. వైసీపీ నేతల్లో చాలా మంది తిట్లు వినలేకప్రజలే గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ఇప్పుడు వీరు తిడుతున్న తిట్లు సరిపోవడం లేదని భావిస్తున్నారో.. లేక ఏమోకానీ.. సీఎం జగన్ తాజాగా.. కలెక్టర్లకు తిట్టి పోసే బాధ్యతలను అదనంగా అప్పగించారు.
మరి ఇక, కలెక్టర్లకు చాలా మందికి తెలుగు రాదు. దీంతో వారు తెలుగు నేర్చుకుని తిడతారో.. లేక వారికి వచ్చిన భాషలోనే అమ్మనా బూతులు తిట్టిపోస్తారో.. లేక సరికొత్త తిట్లు తిడతారో చూడాలని నెటిజన్లు అంటున్నారు.
ఎందుకింత అక్కసు
వివిధ కారణాలతో గతంలో సంక్షేమ పథకాలు అందని 2లక్షల 79 వేల మంది లబ్ధిదారులకు.... 590 కోట్ల 91లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగన్. ఈ సందర్భంగా పింఛన్ల తొలగింపు అంశాన్ని ప్రస్తావించారు. పింఛన్ల తొలగింపుపై నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తీసేయడానికి వీల్లేదన్న జగన్.. ఒకవేళ ఎవరైనా దుష్ప్రచారం చేస్తే.. కలెక్టర్లు గట్టిగా తిట్టిపోయాలని.. ఆదేశించారు.
‘ఏ మంచిపని చేసినా వక్రీకరిస్తున్నారు. ప్రతిదీ పాజిటివ్‌గానే తీసుకుందాం. ఆరోపణల్లో నిజం ఉంటే కరెక్ట్ చేసుకుందాం. అందులో వాస్తవం లేకపోతే ప్రెస్‌మీట్ పెట్టి గట్టిగా తిట్టండి. అలా చేస్తే వాళ్ల తప్పు మనం ఎత్తి చూపినట్లు అవుతుంది. మన తప్పు ఉంటే సరిదిద్దుకుందాం. అందులో తప్పు కూడా లేదు. అలా చేయకపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది. మనం ప్రజా సేవకులం. పాలన అంటే సేవ అనే విషయాన్ని ప్రతి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాలి’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇంకేముంది.. రాజే తలుచుకుని.. తిట్టిపోయమంటే.. కలెక్టర్లు ఆగుతారా.. మైకులు పగిలిపోవడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.