Begin typing your search above and press return to search.
కూతురిని చూసి ఉప్పొంగుతున్న జగన్.. కారణమిదే!
By: Tupaki Desk | 3 July 2022 7:09 AM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. సీఎం జగన్ వర్షిణి రెడ్డి, హర్షిణి రెడ్డి అని ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో హర్షిణి రెడ్డి ప్రస్తుతం యూరోప్ దేశం ఫ్రాన్సు రాజధాని పారిస్ లో ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ లో ఇన్ సీడ్ లో మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేశారు. అది కూడా డిస్టింక్షన్ మార్కులు సాధించారు. దీంతో సీఎం జగన్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో తన భార్య వైఎస్ భారతీరెడ్డితో కలిసి ఇన్ సీడ్ బీ స్కూల్ కాన్వొకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరైన సంగతి తెలిసిందే. కాన్వొకేషన్ కార్యక్రమంలో తన భార్య భారతిరెడ్డితో పాల్గొన్న సీఎం జగన్.. తన కుమార్తె హర్షిణి రెడ్డి ఎంబీఏ పట్టా అందుకుంటున్న దృశ్యాన్ని సంతోషంతో వీక్షించారు. పట్టా అందుకున్న కూతురుతో కలిసి జగన్ దంపతులు ఫొటో దిగారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ తన ఆనందాన్ని పంచుకుంటూ పోస్టు చేశారు.
డియర్ హర్షా చాలా గర్వంగా ఉంది.. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చింది.. దేవుడు నీ పట్ల కృప చూపించాడు. ఈ రోజు నువ్వు ఇన్‌సీడ్ నుంచి డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం గర్వంగా ఉంది. డిస్టింక్షన్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు సంపాదించడం సంతోషంగా ఉంది. ఆ దేవుడు నీకు మరింత మంచిని చేయాలని కోరుకుంటున్నా అని జగన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే తన కూతురుతో కలిసి దిగిన ఫొటోను జగన్ తన పోస్టుకు జత చేశారు.
కాగా కూతురుతో కలసి జగన్ దంపతులు దిగిన ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నారు. మరోవైపు హర్షిణి రెడ్డిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.