Begin typing your search above and press return to search.

సోలోగా జగన్....?

By:  Tupaki Desk   |   7 April 2022 3:43 PM GMT
సోలోగా జగన్....?
X
ఏపీలో మొత్తం మంత్రులు అంతా రాజీనామాలు చేశారు. అంటే మంత్రి అన్న వారు ఇపుడు ఏపీ సర్కార్ లో ఎవరూ లేరన్న మాట. ఇక మిగిలింది ఒక్క‌ ముఖ్యమంత్రి మాత్రమే. కొత్త మంత్రివర్గం ఎపుడు ప్రమాణం చేస్తుంది అన్నది చూస్తే ఈ నెల 11వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు అని చెబుతున్నారు.

దాంతో కొత్త మంత్రివర్గం కొలువుతీరే వరకూ జగనే సోలోగా ఉంటారన్న మాట. అంటే ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్న మాట. నిజానికి ఈ రకమైన పరిస్థితి గతంలో ఉందా అంటే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు కూడా ఇలాగే పరిస్థితి ఉంది.

ఆనాడు అంటే 2019 మే 30న జగన్ ఒక్కరే సీఎం గా ప్రమాణం చేశారు. ఆ తరువాత జూన్ 8న కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. అంటే నాడు తొమ్మిది రోజుల పాటు జగన్ ఒక్కరే ఏపీని పాలించారు. దాంతో ఈసారి నాలుగు రోజులు సైతం జగనే టోటల్ క్యాబినేట్ గా ఉంటారన్న మాట‌.

ఈ మధ్యలో ఆయన కొత్త మంత్రులను ఎంపిక చేసుకుని ఆ జాబితాను గవర్నర్ కి పంపడం, 11న ఉదయం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కొత్త మంత్రులు వచ్చి పాలనా పగ్గాలు పుచ్చుకునే దాకా జగన్ ఒక్కడే ఏపీకి పరిపాలకుడు. అంతే. ఎనీ డౌట్స్...