Begin typing your search above and press return to search.

డేంజర్ నంబర్...అలెర్ట్ అయిన జగన్...?

By:  Tupaki Desk   |   6 April 2022 10:00 PM IST
డేంజర్ నంబర్...అలెర్ట్ అయిన జగన్...?
X
ఎంత ఆధునికత ఉన్నా మరెంతగా అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నా కూడా సెంటిమెంట్లను నమ్మడం ఎవరూ మానరు. పైగా వాటి ఫలితాలు కూడా అలాగే ఉంటున్నాయి. యాధృచ్చికమో మరోటో తెలియదు కానీ నంబర్లు సరిగ్గా లేకపోతే బ్యాడ్ రిజల్ట్ వస్తోంది. విభజన తరువాత ఏపీ ఇంతలా కునారిల్లడానికి ఈ నంబర్ ఆడిన గేమ్ కారణం అని అంటారు.

ఏపీని 13 జిల్లాలతో విడదీశారు. అది నష్టదాయకమైన నంబర్. అయినా చంద్రబాబు పదమూడుతోనే కధ నడిపారు. చివరికి ఏపీ అప్పుల కుప్పగా మారింది. నాడు టీడీపీ పెద్దలు అనుకున్నది ఒక్కటీ అవలేదు. రాజధాని లేని రాష్ట్రంగా కూడా తయారైంది. ఈ క్రమంలో టీడీపీ ఓడింది.

ఇపుడు జగన్ మూడేళ్ల తరువాత 26 జిల్లాలను చేశారు. తొలుత 25 అని అనుకున్నా అరకుని రెండుగా చేయడంతో నంబర్ పెరిగింది. ఇపుడు ఆ నంబరే డేంజర్ అని అంటున్నారు. రెండూ ఆరు కలిస్తే ఎనిమిది. దాంతో ఇది అతి నష్టదాయమైన సంఖ్య అని అంటున్నారుట.

ఇక ఆగమ శాస్త్ర పండితులు అయితే తొమ్మిది నంబర్ వచ్చేలా చూసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అంటే మరో జిల్లాను ప్రకటించడమే పరిష్కారం అని అంటున్నారు. అలా చూసుకునే రంపచోడవరాన్ని ఒక కొత్త జిల్లాగా ప్రకటిస్తున్నారు అని తెలుస్తోంది. దానికి పోలవరం అని పేరు పెట్టాలని అనుకుంటున్నారుట. 13 మండలాలను కలిపి ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలన్న అంశంపై పరిశీలన, కసరత్తు కూడా జరుగుతోంది.

మొత్తానికి 26 నంబర్ తో ఎన్నో వినాశనాలు జరిగాయని చరిత్ర తెలియచేయడం, ఆగమ శాస్త్ర పండితులు సైతం అది నష్టదాయకమైన సంఖ్యగా పేర్కొనడంతో ప్రభుత్వం ఉన్న ఉదుటన అలెర్ట్ అయింది. దాంతో తొందరలోనే 27 జిల్లాలుగా చేసి లక్కీ నంబర్ నైన్ తో కొనసాగాలని చూస్తున్నారుట. మొత్తానికి 27వ జిల్లాగా పోలవరం ఏపీకి రానుంది. దాంతో మూడు గిరిజన జిల్లాలు అవుతాయన్న మాట.