Begin typing your search above and press return to search.

అసెంబ్లీని జగన్ పూర్తిగా వాడుకున్నారా...?

By:  Tupaki Desk   |   25 March 2022 2:30 AM GMT
అసెంబ్లీని జగన్ పూర్తిగా వాడుకున్నారా...?
X
ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలమే ఎక్కువ. మొత్తం 175 మంది సభ్యులలో 151మంది ఆ పార్టీకి చెందిన వారు, ఇక టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలతో పాటు, ఏకైన జనసేన ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారు. ఆ విధంగా చూస్తే మొత్తం సభలో వైసీపీ బలం 156కు చేరుకుంది.

అదే టైంలో టీడీపీ సంఖ్య బాగా తక్కువ. ఇక డే వన్ నుంచి టీడీపీ ఆందోళలను నమ్ముకుంది. ఫలితంగా సభలో వారి గొంతు వినిపించకుండా పోతోంది. వరసగా ప్రతీ రోజూ సస్పెండ్ అవుతూనే ఉన్నారు. ఈ పరిణామంతో ప్రశ్నోత్తర సమయం ముగియక ముందే అసెంబ్లీ నుంచి టీడీపీ మెంబర్స్ బయటకు వెళ్లాల్సి వస్తోంది.

ఈ పరిణామం అధికార పార్టీకి లాభించేలాగానే ఉంది అంటున్నారు. సభ అంత వన్ సైడెడ్ గా మారిపోయింది. బిల్లుల మీద చర్చ వారిదే. తీర్మానాలూ కూడా వారివే అన్నట్లుగా ఉంది. ఇక ముఖ్యమంత్రి జగన్ సభను పూర్తి స్థాయిలో ఈసారి వినియోగించుకున్నారు అని చెప్పాలి.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ఏం చేశారు, నాడు బాబు చేసిన తప్పిదాల వల్ల పోలవరం ఆలస్యం ఎలా జరిగింది. నిధులతో పాటు, విలువైన కాలం ఎలా పోయింది అన్నది సభకు జగన్ సజావుగా వివరించారు. అదే విధంగా మద్యం విషయంలో కూడా జే బ్రాండ్స్ లేవని, ఉన్నవి అన్నీ కూడా సీ బ్రాండ్స్ మాత్రమే అని జగన్ మొత్తానికి మొత్తం వివరించే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు అయిదేళ్ల కాలంలో అలా 256 బ్రాండ్స్ ని ఏపీలో తెచ్చారని కూడా చెప్పుకొచ్చారు. ఇక మూడు రాజధానుల విషయంలో కూడా ప్రభుత్వ వాదన ఇదీ అని చెప్పుకున్నారు. అమరావతి రాజధానికే తాము మొత్తం ఖర్చు పెట్టలేమని, ఏపీ మొత్తం తమకు కావాలని చెప్పడం ద్వారా టీడీపీని కార్నర్ చేశారు. అమరావతికే ఆ పార్టీని పరిమితం చేశారు. మొత్తానికి చూస్తే ఈసారి బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు సాగాయి.

అలాగే సభను జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువ సేపు ప్రధానమైన అంశాలన్నింటినీ చర్చించడం ద్వారా సద్వినియోపరచుకున్నారు అనే అంటున్నారు. మరి సభలో రభస చేసి హైలెట్ అవుదామని టీడీపీ అనుకుంటే వారిని బయటకు పంపించి సభను మొత్తం వైసీపీ ప్రభుత్వం తమ విధానాలను జనాలకు చెప్పడం ద్వారా బాగానే వాడుకుంది అంటున్నారు. మొత్తానికి ఈసారి సమావేశాలలో టీడీపీ వ్యూహాలలోని డొల్లతనం బయటపడింది అనే అంటున్నారు. సభలో సభ్యులు ఉండి అధికార పక్షాన్ని నిలదీసే అవకాశాన్ని మాత్రం కోల్పోయారు అనే అంటున్నారు.