Begin typing your search above and press return to search.
మోడీజీ థాంక్స్...జగన్ మార్క్ మూవ్...?
By: Tupaki Desk | 18 March 2022 7:00 AM ISTఏపీలో రాజకీయం ఇపుడు మారుతోంది. 2014 నాటి పొత్తులను తెర మీదకు తీసుకువద్దామని చూస్తున్నారు. అలా పాత మిత్రులు అంతా కలసి ఏపీలో వైసీపీని ఢీ కొట్టాలని తెర వెనక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ సంగతి పక్కన పెడితే జనసేనాని పవన్ పొలిటికల్ రోడ్ మ్యాప్ ఒకటి ఈ పాటికే ఇచ్చేశారు. దాంతో అధికార వైసీపీ కూడా తన రూట్ మార్చేసింది.
ఏపీలో మూడు పార్టీలు ఈసారి కలవకుండా చేయాల్సినవన్నీ ఆ పార్టీ చేస్తుందని అంటున్నారు. ఎటూ పవన్ చంద్రబాబుల మైత్రిని ఆపలేరు. కానీ వారి పొత్తులతో రెండు పార్టీల క్యాడర్ మధ్య అసంతృప్తి కానీ ఏర్పడేలా చేయగలిగితే గ్రౌండ్ లెవెల్ లో ఆ పొత్తు చిత్తు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అందుకే జనసేనాని ప్రసంగం ఇలా పూర్తి అవగానే అలా వైసీపీ నేతలు టీడీపీ పల్లకీ మోయడానికి జనసైనికులూ రెడీ కండి అని పిలుపు ఇవ్వడమూ జరిగింది. ఇక టీడీపీ తమ్ముళ్ళకు కూడా పొత్తు వల్ల సీట్ల అవకాశాలు తగ్గి చిత్తు అయిపోతారు అని కూడా మరో ప్రచారం కూడా సాగుతోంది. సరే వీటి ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉన్నా కీలకమైన పార్టీ బీజేపీ కలవకపోతే ఇంత పొత్తుకూ పెద్దగా ఆకర్షణ ఉండని అంటున్నారు.
దాంతో బీజేపీ వైపు నుంచి నరుక్కురావడానికి వైసీపీ తయారుగా ఉందనే అంటున్నారు. కేంద్ర స్థాయిలో బీజేపీతో అనధికార మైత్రిని వైసీపీ కొనసాగిస్తోంది అన్న చర్చ ఎపుడూ ఉంది. ఏపీలో చూస్తే బీజేపీలో ఉన్న వర్గాలు కూడా ప్రో వైసీపీ, టీడీపీగా ఉంటాయన్న ప్రచారమూ ఉంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో ఇళ్ళ పట్టాల గురించి మాట్లాడే సందర్భంలో ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పి అందరికీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఏపీలో 31 లక్షలకు పైగా ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని, ఇది మహా యజ్ఞమని, దీనిని పాడు చేయాలని టీడీపీ చూసిందని జగన్ ఆరోపించారు.
అదే టైమ్ లో ఇంతటి స్థాయిలో ఏపీలో ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణం చేపడుతున్నామంటే దానికి కేంద్ర సహకారం కూడా ఒక కారణమని చెప్పారు. అందుకే ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిజానికి చాలా కాలంగా ఏపీ బీజేపీ నాయకులు ఇదే మాట అంటున్నారు. ఏపీలో కడుతున్న ఇళ్ళలో కేంద్ర వాటా కూడా ఉందని సోము వీర్రాజు లాంటి వారు తాముగా చెప్పుకుంటున్నారు. కానీ వైసీపీ మాత్రం జగనన్న ఇళ్ళు అని ప్రచారం చేసుకుంటోందని కూడా విమర్శించారు.
ఇపుడు ఏకంగా జగనే కేంద్రం కూడా సహకరించబట్టే ఏపీలో ఇళ్ల నిర్మాణం సాగుతోందని సభలోనే చెప్పారు. ఒక విధంగా ఇది బీజేపీ నేతలకు ఆనందం కలిగించే విషయమే. అదే టైమ్ లో ప్రధాని మోడీతో జగన్ రిలేషన్స్ బాగున్నాయని చెప్పేందుకే ఈ థాంక్స్ అని కూడా విశ్లేషిస్తున్నారు.
దీని కంటే ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చినపుడు కూడా సభా ముఖంగా జగన్ ఏపీలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేశారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్య అనంతపురం టూర్లో జగన్ అంటే ప్రధాని మోడీ సొంత బిడ్డలా చూసుకుంటారు అని చెప్పి వైసీపీని ఖుషీ చేశారు.
వీటికి కొనసాగింపు అన్నట్లుగా జగన్ మోడీకి థాంక్స్ చెబుతూ బీజేపీకి పొలిటికల్ గా కొంత మైలేజ్ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీ టీడీపీతో కలవకుండా ఆ పార్టీకి స్మూత్ టచ్ ఇచ్చారని చెబుతున్నారు. చూడాలి మరి ఈ కధా కమామీషూ.