Begin typing your search above and press return to search.
బీజేపీకి ఫస్ట్ టైమ్ నో చెప్పనున్న జగన్... ?
By: Tupaki Desk | 4 March 2022 9:00 PM ISTజగన్ రాజకీయాలు వేరేగా ఉంటాయి. ఆయన ఎవరి ఊహలకు అందకుండా తనదైన పాలిటిక్స్ చేసుకుంటూ పోతారు అని చెబుతారు. ఇదిలా ఉంటే కేంద్రం మెడలు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదాను తెస్తానని విపక్ష నేతగా చెప్పిన జగన్ గెలిచిన తరువాత మాత్రం వేరేగా మాట్లాడారని విమర్శలు ఉన్నాయి.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కి పూర్తి బలం ఉంది కాబట్టి మమమేమీ చేయలేమనే ఆయన నాడు అన్నారు. అయినా సరే కేంద్రానికి ప్రత్యేక హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటాను అని కూడా ఆయన చెప్పారు.
ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీకి ఏమీ పెద్దగా ఇవ్వకపోయినా ఆయన అనేక బిల్లుల విషయంలో రాజ్యసభలో మద్దతు ఇస్తూ వచ్చారు. ఇది కూడా మరో రకమైన రాజకీయమని కూడా చెబుతారు.
ఇక జగన్ విపక్ష నేతగా ఉన్నపుడు అంటే 2017లో జరిగిన రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు అయిన రామ్ నాధ్ కోవింద్, ఎం వెంకయ్యనాయుడులకు మద్దతు ఇచ్చారు. అప్పటికే టీడీపీతో బీజేపే బంధం ఉంది. అయినా సరే జగన్ కూడా అదే కూటమి అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడం నాడు చాలా మందికి ఆశ్చర్యం కలిగింది.
ఇపుడు గిర్రున అయిదేళ్ళు తిరిగిపోయాయి. మళ్లీ రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది జూలై లో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ ని ఎంపిక చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఆ విధంగా మైనారిటీ కార్డు తో ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను బుట్టలో వేయాలని చూస్తోంది.
ఈ నేపధ్యంలో ఏపీలో జగన్ మద్దతు చాలా కీలకం కానుంది. మరి జగన్ బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇస్తారా అంటే నిజానికి జగన్ ఇస్తారూ అని ఇప్పటిదాకా వినిపించిన విషయం. అయితే బీజేపీ పోయి పోయి కాంగ్రెస్ మనిషి అయిన అజాద్ ని తెర ముందుకు తెస్తే కనుక జగన్ నో చెప్పే చాన్స్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దానికి ఫ్లాష్ బ్యాక్ కధ కూడా ఉందని అంటున్నారు.
నాడు వైఎస్సార్ తో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు చూసే ఆజాద్ జగన్ సీఎం అయ్యే విషయంలో అడ్డుపుల్ల వేశారని చెబుతారు. అదే విధంగా వైఎస్సార్ మరణించాక వైఎస్సార్ ఫ్యామిలీ వేధింపులకు గురి అయినా ఆయన కాంగ్రెస్ మంచి పొజిషన్ లో ఉండి కూడా పట్టించుకోలేదు అన్న చర్చ కూడా ఉంది. అయితే రాజకీయాలు మారి ఆజాద్ అదే కాంగ్రెస్ కి ఇపుడు అసమ్మతి నేతగా మారారు.
ఈ నేపధ్యంలో బీజేపీ ఆయన్ని దగ్గరకు తీస్తోంది. మరి బీజేపీకి నచ్చారని జగన్ కి ఆజాద్ నచ్చుతారా అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం అంటున్నారు. మరో వైపు ఆజాద్ తన అభ్యర్ధిత్వం పట్ల వైసీపీ వైఖరి ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారని భోగట్టా. ఆయన ఏపీకి చెందిన సీనియర్ మంత్రి, కాంగ్రెస్ లో చాలా కాలం ఉన్న ఆయనతో ఈ మధ్య ఇదే విషయం మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది.
వైసీపీ మద్దతు పూర్తిగా తనకే దక్కేలా చూడాలని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. మరి జగన్ ఈ విషయంలో ఏమంటారో అన్న చర్చ అయితే ఉంది.ఆజాద్ కి కనుక జగన్ నో అంటే మాత్రం ఫస్ట్ టైమ్ ఆయన బీజేపీకి యాంటీ చేసినట్లు అవుతుంది అంటున్నారు.