Begin typing your search above and press return to search.
బీజేపీకి దొరికేసిన జగన్... ?
By: Tupaki Desk | 19 Feb 2022 8:00 AM ISTబీజేపీ నేతలు చెబుతున్నది ఎపుడూ ఒక్కటే. కేంద్రం లేకపోతే ఏపీ లేదు, ఈ రోజుకు కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే ఏపీ అభివృద్ధి సాగుతోంది అని. సోము వీర్రాజు కానీ జీవీల్ నరసింహారావు కానీ మొదలుపెడితే లక్షల కోట్లు ఇప్పటికే ఏపీకి ఇచ్చేశామనే చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ టూర్ కి వచ్చిన వేళ జగన్ సభా ముఖంగానే ఒక మాట చెప్పేశారు.
రాజకీయాలకు అతీతంగా చెబుతున్నా, ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నా అంటూ ఏపీకి కేంద్రం ఇతోధికంగా సాయం చేస్తోంది అని కమిట్ అయిపోయారు. సరిగ్గా ఈ పాయింటే పట్టుకుని బీజేపీ నేతలు ఇపుడు వైసీపీని అల్లల్లాడిస్తున్నారు. ఏపీకి ఎంతో చేశామని మేము రోజూ చెబుతున్నాం, చివరికి ముఖ్యమంత్రి జగన్ కూడా ఇపుడు దాన్ని అంగీకరించారు అని సోము వీర్రాజు గట్టిగా సౌండ్ చేస్తున్నారు.
మేము ఏపీలో రోడ్లు వేయకపోతే అవి అలాగే ఎప్పటికీ ఉండిపోతాయని అంటున్నారు. ఏపీ సర్కార్ రోడ్లను సరిగ్గా అభివృద్ధి చేయడంతో పూర్తిగా విఫలం అయింది అని కూడా సోము విమర్శలు గుప్పించారు. ఇక కేంద్రం రోడ్లు వేస్తే తనవిగా చెప్పుకోవడానికి చూస్తున్నారు అని ఆయన దుయ్యబెట్టారు.
కేంద్రం ఏపీకి ఏం చేసింది అన్న సంగతికి నితిన్ గడ్కరీ ఏపీకి వచ్చి నిరూపించారని ఆయన అన్నారు. ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల నిధులతో ఏపీ రోడ్లను నిర్మిస్తున్న ఘనత తమదని చెప్పుకున్నారు.
ఇక మీదట ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదు అన్న మాటలు వైసీపీ నేతలు అనకుండా సోము వీర్రాజు జగనే ఒప్పుకున్న తరువాత మా ప్రగతిని, చిత్తశుద్ధిని ఎవరైనా కాదనగలరా అని సవాల్ చేస్తున్నారు.
మొత్తానికి చూస్తే జగన్ రాజకీయాలకు అతీతంగా తాను చెబుతున్నానని అంటే దాన్ని పట్టుకుని బీజేపీ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేసింది. మరి దీని మీద వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.