Begin typing your search above and press return to search.

విశాఖ గడ్డ నుంచే జగన్ సంచలనం ...?

By:  Tupaki Desk   |   27 Jan 2023 9:51 PM GMT
విశాఖ గడ్డ నుంచే జగన్ సంచలనం ...?
X
ఏపీ సీఎం జగన్ విశాఖ వస్తున్నారు. ఈ నెల 28న ఆయన కొన్ని గంటల పాటు విశాఖలో గడపబోతున్నారు. జగన్ టూర్ లో ఈసారి ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేవు. ఆధ్యాత్మిక ఆత్మీయ కార్యక్రమాలే షెడ్యూల్ చేయబడ్డాయి. ముందుగా శారదాపీఠం చేరుకుని అక్కడ రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొంటారు. ప్రతీ ఏటా జరిగే పీఠం వార్షికోత్సవాలకు జగన్ సీఎం అయ్యాక క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.

ఆయనకు పీఠ్హాధిపతి స్వామీజీతో ఉన్న అనుబంధం వల్ల ఎలాంటి టైట్ షెడ్యూల్ ఉన్నా విశాఖకు తప్పనిసరిగా వస్తూంటారు. ఈసారి జగన్ రాకకు ప్రత్యేకత ఉంది అని చెప్పాలి. విశాఖలో పరిపాలన మరి కొద్ది నెలలలో మొదలుపెట్టాలని జగన్ చూస్తున్నారు. సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని మీద తీర్పు ఎలా వచ్చినా టెక్నికల్ గా ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖలో ఏర్పాటు చేయాలని తాను విశాఖ నుంచే రూల్ చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు.

దానికి తగిన ముహూర్తాన్ని ఆయన పీఠం అధిపతి స్వరూపానందేంద్రని అడిగి పెట్టించుకుంటారు అని ప్రచారం సాగుతోంది. అంతే కాదు జగన్ త్వరలో విశాఖకు రాజధాని తరలి రాబోతోంది అన్న విషయాన్ని సంకేతంగా చెబుతారు అని అంటున్నారు. అధికార వర్గాలకు ఈ విషయం మీద మరింత స్పష్టత సీఎం టూర్ తరువాత వస్తుందని అంటున్నారు.

విశాఖలో మార్చి లేదా ఏప్రిల్ నెలలలో సీఎం క్యాంప్ ఆఫీస్ షిఫ్టింగ్ ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటికే దీని మీద మంత్రుల స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ఈ మధ్యనే బొత్స సత్యనారాయణ విద్యా శాఖకు హింట్ ఇచ్చారు. సీఎం విశాఖకు వెళ్తే ఆయనతో వెళ్లే మొదటి శాఖ విద్యా శాఖ అని ఆయన అధికారులకు చెప్పి లోకల్ గా ఆఫీస్ షిఫ్టింగ్ ని రద్దు చేయించారు.

ఇక విశాఖ మంత్ర్లు గుడివాడ అమరనాధ్, బూడి ముత్యాలనాయుడు వంటి వారు ఇదే విషయం చెబుతున్నారు. అయితే జగన్ విశాఖ రాక సందర్భంగా మరోసారి దీని మీద ఆయన నోటి వెంట ఒక కచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఏదో వినాలని అంతా ఎదురుచూస్తున్నారు. విశాఖ నుంచి పాలన అయితే ఖాయం. అది ఎపుడూ ఏమిటి అనేది మాత్రం సీఎం జగన్ ఈసారి టూర్ లో రివీల్ చేస్తారా అన్నదే చర్చగా ఉంది.

ఇక సీఎం ఇద్దరు ఎంపీల ఇళ్ళలో జరిగే శుభ కార్యాలకు అటెండ్ అవుతున్నారు. అలా అత్మీయ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటున్నారు. ఈసారి సీఎం టూర్ లో మరో స్పెషాలిటీ ఉంది అని అంటున్నారు. ఆయన సతీసమేతంగా విశాఖ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే విశాఖ రాజధాని విషయంలో ఆ విధంగా సీఎం ఒక క్లారిటీ ఇచ్చేశారు అని అంటున్నారు. విశాఖకు షిఫ్ట్ అవుతూండడంతోనే జగన్ సతీమణితో కలసి ముందుగా ఈ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు.

మరి మంచి ముహూర్తం ఏది ఏమిటి అన్నది స్వరూపానందేంద్ర వివరిస్తారని దాని మీద చకచకా షిఫ్టింగ్ పనులు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. మొత్తానికి జగన్ నోటితో ఏదీ చెప్పకపోయినా తన టూర్ ద్వారా సంచలన విషయం ఒకటి మోసుకొస్తారని ఆ విధంగా సంకేతాలు వెలువడతాయని వైసీపీ నేతలు అధికార వర్గాలతో సహా అంతా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.