Begin typing your search above and press return to search.

పచ్చ మీడియా కు జగన్ షాక్.. బాబు కు ఇంగ్లీష్ రాదా?

By:  Tupaki Desk   |   12 Dec 2019 7:32 AM GMT
పచ్చ మీడియా కు జగన్ షాక్.. బాబు కు ఇంగ్లీష్ రాదా?
X
పచ్చ మీడియా పై జగన్ శివాలెత్తారు. అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేశారు. ప్రభుత్వంపై బురద జల్లే దురుద్దేశపూరిత కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం జీవో 2430ను తీసుకొచ్చింది. దీనిపై చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాద్ధాంతం చేస్తున్నారు.

మీడియా తప్పుడు వార్తలపై తెచ్చిన జీవోనంబర్ 2430పై గురువారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు, చంద్రబాబు లేవనెత్తారు. దీనిపై సీఎం జగన్ సభ లో చంద్రబాబు ను, పచ్చమీడియా తీరును కడిగి పారేశారు.

జీవోను అసలు చంద్రబాబు చదివారా? అందులో ఏం తప్పుంది.? అసలు చంద్రబాబుకు ఇంగ్లీష్ రాక.. జీవో అర్థం చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారంటూ జీవోను మొత్తం చదవి సీఎం జగన్ సభలో చదివి వినిపించారు.

ఉద్దేశ పూర్వకం గా తప్పుడు కథనాలు రాసే వారికే ఈ జీవో వల్ల ఇబ్బంది అని జగన్ మరోసారి హెచ్చరించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు చంద్రబాబు ను భూజాన వేసుకొని తమపై ఎంత బురదజల్లినా మేం చూస్తూ ఊరుకోవాలా? ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తే మేం పడాలా? అని జగన్ నిలదీశారు. ఆధారాల్లేకుండా.. నిందలు, ఆరోపణలు చేస్తుంటే అధికారులు వానిటి భరించాలా? మా హక్కులకు భంగం కలిగితే ప్రశ్నించకూడదా.. పరువు నష్టం దావా వేసే హక్కు కూడా లేదా అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ గల చంద్రబాబు కనీసం ఇంగిత జ్ఞానం లేదా అంటూ జగన్ ఎద్దేవా చేశారు.