Begin typing your search above and press return to search.

ఏపీ అధికార వర్గాన్ని షేక్ చేసిన జగన్

By:  Tupaki Desk   |   13 Oct 2020 7:02 PM IST
ఏపీ అధికార వర్గాన్ని షేక్ చేసిన జగన్
X
ఏపీ సీఎం జగన్ ప్రక్షాళన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రేహౌండ్స్, అక్టోపస్ ఆపరేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ గా ఆర్.కే. మీనాను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 1995 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన మీనా.. కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఏసీబీ డైరెక్టర్ శంఖ బ్రతబాగ్చి బదిలీ అయ్యారు. ఆయనను ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. బాగ్చి 1996 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.

ఇక కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి త్రివిక్రమ్ వర్మను గుంటూరు రేంజ్ డీఐజీగా నియమించారు. ఇంటెలిజెన్స్ డీఐజీ విజయ్ కుమార్ ను బదిలీ చేసి హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.

2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సుధీర్ కుమార్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా నియమించారు.