Begin typing your search above and press return to search.

జగన్ కేబినెట్ లో మంత్రులు వీరే

By:  Tupaki Desk   |   7 Jun 2019 1:18 PM GMT
జగన్ కేబినెట్ లో మంత్రులు వీరే
X
నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ కూర్పుపై నేటి ఉదయం నిర్ణయం తీసుకున్నారు. వైసీఎల్పీ భేటీ తర్వాత సాయంత్రానికి విజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్ వద్దకు లిస్టుతో వెళ్లిన జగన్... రేపు మంత్రులుగా ప్రమాణం చేయనున్న నేతల పేర్లతో కూడిన జాబితాను గవర్నర్ కు అందజేశారు.

ఈ జాబితాలో 25 మంది మంత్రుల పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా స్పీకర్ గా పార్టీ సీనియర్ నేత, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ గా బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతిలకు అవకాశం కల్పిస్తున్నట్లుగా గవర్నర్ కు జగన్ చెప్పినట్లుగా సమాచారం. మంత్రుల జాబితాలో పేర్లు ఉన్న నేతలు వీరే.

1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు, చిత్తూరు జిల్లా)
2. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్, కర్నూలు జిల్లా)
3. మేకపాటి గౌతం రెడ్డి (ఆత్మకూరు, నెల్లూరు జిల్లా)
4. పుష్ప శ్రీవాణి (కురుపాం, విజయనగరం జిల్లా)
5. కొడాలి నాని (గుడివాడ, కృష్ణా జిల్లా)
6. నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా)
7. చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (ఆచంట,పశ్చిమ గోదావరి జిల్లా)
8. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు, ప్రకాశం జిల్లా)
9. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ, నెల్లూరు జిల్లా)
10. అవంతి శ్రీనివాస్ (భీమిలి, విశాఖపట్టణం జిల్లా)
11. అంజాద్ బాషా (కడప, కడప జిల్లా)
12. ఆళ్ల నాని (ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా)
13. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లా)
14. కన్నబాబు (కాకినాడ రూరల్, తూర్పు గోదావరి జిల్లా)
15. ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా)
16. పిల్లి సుభాస్ చంద్రబోస్ (పశ్చిమ గోదావరి జిల్లా)
17. మేకతోటి సుచరిత (పత్తిపాడు, గుంటూరు జిల్లా)
18. పేర్ని నాని (మచిలీపట్నం, కృష్ణా జిల్లా)
19. తానేటి వనిత (కోవూరు, పశ్చిమ గోదావరి జిల్లా)
20. పినిపే విశ్వరూప్ (అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా)
21. ఆదిమూలపు సురేశ్ (సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా)
22 గుమ్మనూరు జయరాం (ఆలూరు, కర్నూలు జిల్లా)
23. వెలంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ, కృష్ణా జిల్లా)
24. మోపిదేవి వెంకటరమణ (గుంటూరు జిల్లా)
25. శంకర్ నారాయణ (పెనుగొండ, అనంతపురం జిల్లా)