Begin typing your search above and press return to search.

జగన్ సంచలన నిర్ణయం..కీలక చట్టానికి సవరణలు

By:  Tupaki Desk   |   28 Nov 2020 11:00 AM IST
జగన్ సంచలన నిర్ణయం..కీలక చట్టానికి సవరణలు
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల ప్రక్రియను ఇప్పటివరకు ఉన్న గడువును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి 21 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దాని స్థానే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పద్నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్ని నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆ వ్యవధిని పద్నాలుగు రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1994 పంచాయితీ రాజ్ చట్టంలో చేసిన సవరణలపై ఆగస్టులో గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.

అయితే.. ఏదైనా ఆర్డినెన్స్ ను నిర్ణీత వ్యవధిలోపు చట్టసభలో బిల్లు రూపంలో ప్రవేశ పెట్టి.. ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే.. ఇదేమీ కావటంతో.. ఈ అంశం మరోమారు తెర మీదకు వచ్చింది. తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 21 రోజుల నుంచి 14 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన బిల్లును తాజా అసెంబ్లీ సమావేశంలో ప్రవేశ పెట్టనున్నారు. చట్టసభ ఆమోదం పొందటానికి ఎలాంటి అభ్యంతరాలు లేనినేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణ గడువును కుదించటం లాంఛనంగా మాత్రమే ఉందని చెప్పాలి.

తాజాగా మార్చిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదటి రోజు ఎన్నికల నోటిఫికేషన్.. మూడో రోజున నామినేషన్లస్వీకరణ.. ఐదో రోజు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఉంటుంది. ఆరో రోజున నామినేషన్లను పరిశీలిస్తారు. ఏడో రోజున తిరస్కరిస్తారు. అదే రోజున అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేసే వీలుంటుంది. ఎనిమిదో రోజున అభ్యంతరాల పరిష్కారం.. తొమ్మిదో రోజున నామినేషన్ల ఉపసంహరణ.. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రచురిస్తారు. 14వ రోజున పోలింగ్.. అదే రోజున ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన ఉండనుంది. ఇందుకు తగ్గట్లు చట్టాన్ని మార్చనున్నారు.