Begin typing your search above and press return to search.
ఆ కృష్ణపట్నం భూములు వెనక్కి.. ప్రభుత్వం ఉత్తర్వులు
By: Tupaki Desk | 25 Nov 2020 10:45 AM ISTగత పాలకులు ఇష్టారాజ్యంగా పందేరం చేసిన విలువైన భూములు ఇప్పటికీ వాడకుండా కొన్ని కంపెనీలు అప్పనంగా అనుభవించేస్తున్నాయి. అవన్నీ వృథాగా ఎందుకు పనికిరాకుండా పడి ఉన్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు వాడుకోని భూముల లెక్క తేల్చి వాటి స్వాధీనానికి నడుం బిగించింది.
తాజాగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ‘కినెటా’ పవర్ ప్రాజెక్టుకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు రూ.2997 కోట్ల వ్యయంతో ‘కినెటా’ పవర్ సంస్థ ఆంధ్రప్రభుత్వంతో 2012లో ఒప్పందం చేసుకుంది. అయినా ఇంతవరకు థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించలేదు.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ 3 సార్లు నోటీసులు ఇచ్చినా సంస్థ నుంచి స్పందన రాలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం గతంలో అప్పగించిన 840 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ భూములు వెనక్కి తీసుకుంటూ ఏపీఐఐసీ ఉత్తర్వులు జారీ చేసింది.