Begin typing your search above and press return to search.
సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 7 Nov 2020 10:00 AM ISTగద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో తన మార్క్ ను చూపిస్తున్న సీఎం జగన్ మరో సాహసోపేత నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదో చారిత్రాక నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.
ఐదేళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారని హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.. మహిళా ఖైదీల విషయంలో దేశ చరిత్రలోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. మహిళల విషయంలో ఇంతటి చొరవ ఎవరూ తీసుకోలేదన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 147 మంది మహిళా జీవిత ఖైదీల్లో 55 మంది విడుదలకు అర్హత కలిగి ఉన్నారని హోంమంత్రి ప్రకటించారు. పూర్తి పరివర్తనతో బయటకు వచ్చిన ఖైదీలు కుటుంబాలతో సంతోషంగా ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా వారి కాళ్లపై వారు నిలిచేలా శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు మహిళా ఖైదీలకు వృత్తులపై శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.
క్షణికావేశంలో.. ప్రత్యేక పరిస్థితుల్లో నేరాలు చేసిన వారు.. శిక్షలతో కుమిలిపోతున్న వారికి సీఎం జగన్ నిర్ణయం ఊరటనిస్తుందని తెలిపారు. ఇంతమంది ఖైదీల విడుదల చారిత్రాత్మకమని అన్నారు. వారం రోజుల్లోపు వీరందరినీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పురుష ఖైదీల విడుదలకు సంబంధించి జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.