Begin typing your search above and press return to search.
జగన్ సర్కార్ మరో సంచలనం
By: Tupaki Desk | 10 Sept 2020 6:30 PM ISTనాన్న వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ వైద్యరంగానికి పెద్ద పీట వేస్తున్నాడు. పేద ప్రజల ఇంటి ముంగిటకే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
త్వరలోనే ఏపీలో ‘వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్’లను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. ఏడాదిలోగానే పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 7458 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిల్లో 80శాతం కేంద్రాలకు సొంతంగా భవనాలు లేవు. చిన్న గుడిసెల్లో కూలిపోయే స్థితిలో కొన్ని భవనాలు ఉన్నాయి.
ఇక వాటన్నింటి స్థానంలో కొత్తగా సీఎం జగన్ ఆదేశాల మేరకు భవనాలు నిర్మిస్తోంది. పూర్తి సదుపాయాలతో ఈ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఏపీ వ్యాప్తంగా సుమారు 10వేలకు పైగానే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయనున్నారు. 8890 కేంద్రాలు కొత్తగా నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికే 8724 ఉపకేంద్రాల్లో ఇప్పటికే పనులు మొదలయ్యాయి.