Begin typing your search above and press return to search.

తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు .. జగన్ సీరియస్ వార్నింగ్ !

By:  Tupaki Desk   |   25 Aug 2020 1:00 PM GMT
తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు ..   జగన్ సీరియస్ వార్నింగ్ !
X
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. కరోనాను జయించి వీరిలో 2,68,828 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 89,516 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,368 మంది మరణించారు. అలాగే దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానం లో ఉంది. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఇక కరోనాతోనే రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతుంటే .. ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా భాదితుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. కరోనా అని హాస్పిటల్ లో చేరితే లక్షలకి లక్షలు బిల్లులు వేసి కరోనాతో కంటే కరోనా సోకినందుకు హాస్పిటల్స్ బిల్లులు చూసే చాలామంది భయపడుతున్నారు.

రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా చికిత్సల కోసం భారీ ఫీజులు వసూలు చేయడంపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌ అయ్యారు. భారీ ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులకు భారీ మూల్యం తప్పదన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని, ఈ మేరకు కలెక్టర్ల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల కరోనా రోగుల వద్ద నుంచి అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఆసుపత్రులపై సీఎం ఫైర్ అయ్యారు. స్పందన కార్యక్రమంపై సమీక్ష జరిపిన సీఎం అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే కరోనా రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. కరోనా బాధితుడికి అరగంట లోపు బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ ‌లదేనని , 104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్‌ కాల్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం,మొక్కుబడిగా సమాధానాలివ్వడం చేయకూడదన్నారు.