Begin typing your search above and press return to search.

ఉద్యోగాల భ‌ర్తీలో జ‌గ‌న్ పెను సంచ‌ల‌నం..మామూలు ట్విస్ట్ కాదుగా..

By:  Tupaki Desk   |   17 Oct 2019 11:21 AM GMT
ఉద్యోగాల భ‌ర్తీలో జ‌గ‌న్ పెను సంచ‌ల‌నం..మామూలు ట్విస్ట్ కాదుగా..
X
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇటు ప్రభుత్వ పరంగా... అటు పార్టీ పరంగా ఎవరు ఊహించని సంచలనాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చినట్టుగానే పాల‌న‌లో ఎన్నో మార్పులు - చేర్పుల‌తో ... పాలనలో తనదైన ముద్ర వేయటంలో సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పటికే గ్రామ సచివాలయం ద్వారా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన జగన్... గ్రామ వాలంటీర్లతో రాష్ట్రంలో చాలావరకు నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు తన వంతు కృషి చేశారు.

గ్రామ సచివాలయం... గ్రామ వాలంటీర్ల లాంటి వ్య‌వ‌స్థ‌ను భారతదేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదని... ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఉద్యోగాల భర్తీలో జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాలు అత్యున్నతమైనవి. పరిపాలన వ్యవస్థలో కీలకమైన పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు అన్నది తెలిసిందే.

ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాలకు అభ్య‌ర్థుల‌ను రాత పరీక్షతోపాటు... ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో చాలామంది రాజకీయ నాయకుల చేత మేనేజ్ చేసుకోవడంతో రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అదే టైంలో రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారు సైతం ఇంట‌ర్వ్యూల్లో మేనేజ్ చేసుకోవ‌డంతో వారు మంచి ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధానంపై అభ్యర్థుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈ పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జనవరి నుంచి ఈ నిర్ణ‌యం అమల్లోకి తీసుకురావాలని సూచించారు. గురువారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ ఉద్యోగాల పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా... చాలా పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని జగన్ ఆదేశించారు. నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా జనవరిలో క్యాలెండర్ ఇవ్వాలని కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉద్యోగాల భ‌ర్తీకి ఇంట‌ర్వ్యూలు లేకుండా నిర్ణ‌యించ‌డం జ‌గ‌న్ తీసుకుంది డేరింగ్ స్టెప్పే అనుకోవాలి.