Begin typing your search above and press return to search.

3 రాజధానుల బిల్లును ప్రజలు అంగీకరించారు

By:  Tupaki Desk   |   21 July 2020 12:30 PM GMT
3 రాజధానుల బిల్లును ప్రజలు అంగీకరించారు
X
ఇంతకీ వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రతిపాదించిన 3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రజాభీష్టమేనా? ఇందులో ఏమైనా అనుమానాలున్నాయా? ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లును అడ్డుకుంటున్న వేళ వైఎస్ జగన్ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. గత శనివారం ఈ బిల్లులను ఏపీ గవర్నర్‌కు ఆమోదం కోసం పంపారు, ఆ బిల్లులను తిరస్కరించాలని టిడిపి గవర్నర్‌కు లేఖ రాసింది.

ప్రతిపక్షాల విమర్శలు.. చర్యలపై స్పందించిన ఏపీ సిఎం వైయస్ జగన్ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సెలెక్ట్ కమిటీ ప్రక్రియ ముగిసిందని, ఆమోదం కోసమే ఈ బిల్లులను గవర్నర్‌కు పంపించామని చెప్పారు.

"రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సీఎం వైయస్ జగన్ కల. ఏపీ క్యాపిటల్‌పై ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు. ఒక కమిటీని నియమించి ప్రజల అభిప్రాయం తీసుకొని, చాలా మంది నిపుణులను సంప్రదించిన తరువాత రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని నిర్ణయించారు. వెనుకబడి ఉత్తరఆంధ్రా.. రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే ఇలా చేశారు.. కాబట్టి వికేంద్రీకరణ అభివృద్ధి కోసమే ఇలా మూడు రాజధానులు విభజించారు ”అని సజ్జల అన్నారు.

చంద్రబాబు.. టిడిపి నాయకుల ఆగ్రహాన్ని మేము అర్థం చేసుకున్నామని.. ఎందుకంటే వారు అమరావతి రైతులను దోచుకున్నారని.. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రయత్నించారని సజ్జల ఆరోపించారు. రాజధాని మార్చబడితే, టిడిపి నాయకుల వ్యాపారాలు కూలిపోతాయని విమర్శించారు. డబ్బుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినందున మూడు రాజధానులపై వారు ఏడుస్తున్నారన్నారు. కానీ మూడు ప్రజలు రాజధానులు కలిగి ఉండాలన్న జగన్ కోరికను ఏపీ ప్రజలు స్పష్టంగా అంగీకరించారని.. దానిని ఎవరూ ఆపలేరు ”అని సజ్జల పేర్కొన్నారు.

గౌరవనీయ గవర్నర్ ప్రజల కోరికను అర్థం చేసుకుంటారని.. మూడు రాజధానులు.. సిఆర్డిఎ బిల్లులను రద్దు చేయడాన్ని ఆమోదిస్తారని సజ్జల ఆశించారు. గవర్నర్‌కు బిల్లులు పంపించి దాదాపు మూడు, నాలుగు రోజులు అయ్యింది. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సజ్జల తెలిపారు..