Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో సీఎస్ యుద్ధం..ఏం జరుగబోతోంది?

By:  Tupaki Desk   |   4 May 2019 8:22 AM GMT
చంద్రబాబుతో సీఎస్ యుద్ధం..ఏం జరుగబోతోంది?
X
అనుకున్నట్టే అయ్యింది.. చంద్రబాబు తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ఏపీలో వచ్చే వారం ఏ జరుగుతుందన్న టెన్షన్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబా? సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యమా? ఎవరి పంతం నెగ్గుతుందనేది తేలబోతుంది.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు ఈ యుద్ధంలో గెలుస్తారా? మరి అధికారాలున్న సీఎస్ పంతం నెగ్గించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలా జరిగాయి. ఎన్నికల కమిషనర్ కేంద్రం సాయంతో ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఉన్న సీఎస్ ను తీసివేయించి కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను అపాయింట్ చేశారు. దీంతో బాబు సీరియస్ అయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ గా నియమిస్తారా అని ఈసీ వైఖరిని తూర్పార పట్టారు. దీనికి తీవ్రంగా మనస్తాపం చెందిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం యుద్ధం మొదలెట్టారు. చంద్రబాబు సమీక్షలకు వెళ్లకుండా.. ఆయనకు రోజువారీ రిపోర్టులు ఇవ్వకుండా అసలు సీఎంగా చంద్రబాబును గుర్తించకుండా ఆయనే సొంతంగా పాలిస్తున్నారు. ఎన్నికల కోడ్ ను అవకాశంగా మలుచుకొని చంద్రబాబును డమ్మీగా మార్చి చెడుగుడు ఆడేస్తున్నాడు. దీంతో ఏపీలో సీఎస్ వర్సెస్ సీఎం చంద్రబాబు లా పరిస్థితి తయారైంది.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమ్మల్లో ఉందని.. బాబుకు అధికారాలు లేవంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

దీంతో సీఎస్ తో పాటు ఎన్నికల సంఘంపై చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. ఎలాగైనా సరే వారికి సమాధానం ఇవ్వాలని కేబినెట్ సమావేశానికి ఆదేశించారు. ఇందులో అందరూ మంత్రులతో సమావేశమై ఈసీ - సీఎస్ ల వైఖరిపై తేల్చేయాలని డిసైడ్ అయ్యారు. వచ్చేవారమే కేబినెట్ సమావేశమని ప్రకటించారు. అధికారులంతా బిజినెస్ రూల్స్ పాటించాల్సిందేనని.. కేబినెట్ సమావేశానికి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కోడ్ ఉన్నా కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగుసార్లు కేబినెట్ భేటి నిర్వహించిందని బాబు తెలిపారు.ఇక్కడ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అయితే ఇదే సమయంలో సీఎస్ మాత్రం కోడ్ అమల్లో ఉండగా.. చంద్రబాబు భేటికి ఏ అధికారి హాజరుకావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు కేబినెట్ భేటికి అజెండా ఫిక్స్ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని అధికారులే నిర్వహించాలి. దీంతో సీఎస్ ఆదేశాలతో వారంతా సైలెంట్ అయ్యారు. ముఖ్యమంత్రిని ఢీకొనడానికే సీఎస్ డిసైడ్ అయ్యారు. దీంతో చంద్రబాబు నిర్ణయాన్ని సీఎస్ అమలు చేస్తారా? లేదా కోడ్ పేరుతో కేబినెట్ భేటికి అడ్డు పడుతారా అనేది ఏపీలో ఉత్కంఠ రేపుతోంది.