Begin typing your search above and press return to search.
ఏపీకి దిష్టిబొమ్మల మాదిరి తయారయ్యారే?
By: Tupaki Desk | 23 Aug 2021 3:35 PM ISTఢిల్లీలోని పెద్ద బాసుల్ని చూసినంతనే.. వంగిపోవటం బాగా అలవాటైన ఏపీ బీజేపీ నేతలకు రాష్ట్రం.. రాష్ట్ర ప్రయోజనాలు అస్సలు పట్టని పరిస్థితి. విభజన నేపథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున హామీలు లభించాయి. రాజధానిని కూడా ఢిల్లీని తలపించేలా నిర్మిస్తామన్న మాట ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చింది. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయన్నది తెలిసిందే. తమకున్న ఇబ్బందుల కారణంగా ఏపీ బీజేపీ నేతలు నోరు విప్పి మాట్లాడలేకపోవచ్చు. అడగలేకపోవచ్చు. కానీ.. మిగిలిన వారు అడుగుతుంటే అడ్డు పడాల్సిన అవసరం లేదు. తమకున్న స్వామిభక్తిని ప్రదర్శించుకోవటానికి సదా సిద్ధమన్నట్లుగా ఉండే ఏపీ బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అంతో ఇంతో కమిట్ మెంట్ ప్రదర్శిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీ వరకు వస్తే.. విభజన కారణంగా ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో రెవెన్యూ లోటు భర్తీతో పాటు మరిన్ని వరాల్ని .. హామీల్ని ఇచ్చారు. కీలక సంస్థల ఏర్పాటుతో పాటు.. పోలవరం నిర్మాణం.. ప్రత్యేక హోదా.. రైల్వేజోన్ లాంటి హామీలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేయటమే కాదు.. కుదరదన్న విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్పటం తెలిసిందే.
ఇక.. విశాఖ రైల్వే జోన్ ను కూడా కాకి ఎత్తికెళ్లిపోయినట్లే. రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రయోజనాలకు ఇంతలా దెబ్బ పడుతున్నా.. వాటి గురించి ప్రశ్నించాలన్న ఆలోచన ఏపీ బీజేపీ నేతలకు లేకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఏదో ఒక పని మీద ఏపీకి వచ్చే కేంద్ర నేతల మీద ఒత్తిడి పెట్టేట్లు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ.. అవేమీ జరగని పరిస్థితి. ఈ మధ్యన జరిగిన తిరుపతి ఉప ఎన్నికల వేలలోనూ.. బీజేపీ నేతలకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ.. వేటికి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్న నేతలు.. అందుకు సమాధానాల్ని వెతికే ప్రయత్నం మాత్రం చేయకపోవటం గమనార్హం.
కొన్ని సందర్భాల్లో తాము చేయలేని పనిని.. చేయాల్సిన వారితో చేయిస్తుంటారు. తమకు పార్టీలో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో.. ఆ భాధ్యతను అధికారపక్ష నేతలో.. మీడియా ప్రతినిధులో తీసుకునే ప్రయత్నం చేసినా.. వారినోటి నుంచి మాట రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రానికి పెద్ద ఎత్తున వీవీఐపీలు వస్తుంటారు. కేంద్రం ఇచ్చిన డిమాండ్ల గురించి వీరిని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే.. ఏపీ నేతలు అడ్డుకోవటం లేదంటే కొండ మీద రాజకీయాల గురించి ఎలా మాట్లాడతారంటూ తప్పించుకునే ప్రయత్నం కనిపిస్తుంది.
సాధారణంగా ఏ రాష్ట్రానికి చెందిన నేతలైనా సరే.. ముందు తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడరు. నష్టం జరుగుతుంటే వారు తట్టుకోలేరు. పార్టీ ప్రయోజనాలు తర్వాత.. రాష్ట్రంలో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటూ ఒత్తిడి తీసుకొస్తారు. బ్యాడ్ లక్ ఏమంటే.. అలాంటి ప్రయత్నం ఏదీ కూడా ఏపీ బీజేపీ నేతల్లో కనిపించదు. ఇదంతా చూసినప్పుడు ఏపీ ప్రయోజనాల మీద ఏ మాత్రం ధ్యాస లేని వారి విషయంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నది మర్చిపోకూడదు. మరి.. ఏపీ బీజేపీ నేతల మైండ్ సెట్ మార్చటం ప్రజల చేతుల్లోనే ఉంది. అప్పుడు మాత్రమే వారు దారికి వస్తారేమో?