Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీ : ఐదో రోజు సభలో అదే సీన్ రిపీట్ !
By: Tupaki Desk | 4 Dec 2020 12:01 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల చెలరేగుతుంది. ఐదో రోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. గట్టిగా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయని, సహకరించాలని స్పీకర్ కోరినా టీడీపీ సభ్యులు వినలేదు. విపక్ష సభ్యుల గందరగోళం నడుమ పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది.
శాసనమండలిలో విపక్షాల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. అమరావతిపై చర్చించాలని అనుకున్నప్పుడు బీఏసీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీఏసీలోని ప్రతీ అంశంపై చర్చించడానికిసిద్దంగా ఉన్నామని ప్రకటించారు. పబ్లిసిటీ కోసం టీడీపీ అమరావతి అంటోందని, అమరావతి గురించి చర్చించడానికి తమకు భయం లేదన్నారు. అయితే టీడీపీ సభ్యులు పోడియం వద్ద కి వచ్చి నినాదాలు చేస్తుండటం తో సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కొందరు టీడీపీ సబ్యులని సస్పెండ్ చేసారు. నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, జోగేశ్వరరావు, సత్యప్రసాద్, అశోక్, రామరాజులను సస్పెండ్ చేశారు. వీరితో పాటు చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అమూల్ పై చర్చ జరుగుతుండగా చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం.
అమూల్ లో సభలో సీఎం జగన్ మాట్లాడుతూ .. అమూల్‌పై చర్చ సందర్భంగా చంద్రబాబు సభలో ఉంటారని తాము ఆశించామని, ఆయన మాత్రం స్వప్రయోజనాలు చూసుకున్నారని అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని, సభ నుంచి సస్పెండ్ చేయించుకుని ఎల్లోమీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జులై 8న రూ.2,250 నుంచి రూ.2500లకు పింఛన్ పెంచుతామని హామీయిచ్చారు. 2023 జులై 8న రూ.2,750 నుంచి రూ.3వేలకు పింఛన్ పెంచుతామని ప్రకటించారు.