Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీ అప్డేట్స్: ఈరోజు ఏం జరిగిందంటే?
By: Tupaki Desk | 2 Dec 2020 12:43 PM ISTఏపీ అసెంబ్లీలో మూడోరోజు వాడివేడిగానే కొనసాగుతోంది. తొలి రెండు రోజులు మాటల యుద్ధం నడిచింది. ఇక ఈ సందట్లోనే కీలక బిల్లులను వైసీపీ మంత్రులు, సీఎం జగన్ సభలో ప్రవేశపెట్టారు.
ఏపీ అసెంబ్లీలో తాజాగా వైసీపీ పలు బిల్లులను ప్రవేశపెట్టింది. ఏపీ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ థర్డ్ అమైన్‌మెంట్‌ను బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. యానిమల్ ఫీడ్, క్వాలిటీ కంట్రోల్ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. మంత్రి సీదిరి అప్పలరాజు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఏపీ స్టేట్ డెపలప్‌మెంట్ కార్పొరేషన్, వ్యవసాయ భూముల (వ్యవసాయేతర అవసరాల మార్పిడి) సవరణ బిల్లు-2020 (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ (కన్వర్షన్ నాన్ అగ్రికల్చరల్ పర్పస్) అమెండ్‌మెంట్ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఇది చారిత్రక బిల్లుగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అభివర్ణించారు. రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు.ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ డ్యూటీ బిల్లుతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లు చదవకుండా ప్రతిపక్ష సభ్యులు అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ తోపాటు 24 గంటల కరెంట్ కోసమే దీన్ని తీసుకొచ్చామని తెలిపారు. చంద్రబాబు విద్యుత్ రంగాన్ని నష్టాల్లోకి నెట్టారని.. రెండు రూపాయలకు విద్యుత్ దొరికే అవకాశం ఉన్నా.. రూ.4.80 పైసలకు కొనుగోలు చేశారని ఆరోపించారు.
అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. ఇవాళ అసెంబ్లీలో11 బిల్లులు చర్చకు రానున్నాయి. పోలవరం, కరోనా కట్టడి, బీసీ సంక్షేమ కార్పొరేషన్లపై శాసనసభలో చర్చించనున్నారు.