Begin typing your search above and press return to search.

ఏపీకి మూడు రాజ‌ధానులు...బిల్లుకు అసెంబ్లీ ఓకే

By:  Tupaki Desk   |   21 Jan 2020 4:17 AM GMT
ఏపీకి మూడు రాజ‌ధానులు...బిల్లుకు అసెంబ్లీ ఓకే
X
ఆంధ్రప్రదేశ్‌కు మూడు ప్రాంతాల్లోని నగరాలు రాజధానులుగా కొనసాగించే చారిత్రాత్మ‌క నిర్ణ‌యానికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం లో పాలనా వికేంద్రీకరణ బిల్లు కు చట్టసభ ఆమోదం తెలిపింది. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధాని గా కర్నూలు ఏర్పాటుకానున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు పై సభ లో వాడివేడి చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత అసెంబ్లీ ఆ బిల్లులను ఆమోదించింది. ఈ సందర్భం గా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ స‌వివ‌ర‌, సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు.

రాజధాని వికేంద్రీకరణ అంశం పై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ... సుధీర్ఘ చర్చ తర్వాత బిల్లును ఆమోదించింది. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత అధికార పక్షం విపక్షం మాట్లాడం, అనుకూల, వ్యతిరేక ప్రసంగాలు చేయడం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్చకు సమాధానం ఇచ్చారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు కు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాతమాట్లాడుతూ .. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, కొత్తగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అమరావతి కి అన్యాయం చేయడం లేదని, మిగతా ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి వేదికగానే చట్టాలు చేస్తామని చెప్పారు. అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అమరావతి ని అభివృద్ధి చేయడానికి ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి వచ్చే ఫలితాన్ని వివరించారు.


రాష్ట్ర చరిత్ర లో చరిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టే అవకాశం తనకు కల్పించారంటూ సీఎం జగన్ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి సభకు పరిచయం చేసే అవకాశం దక్కడం అదృష్టంగా పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అన్నిప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యం తో శాసన రాజధాని గా అమరావతి, పరిపాలన రాజధాని గా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌ విశాఖలో ఉంటుందని, కర్నూలు లో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బోర్డు, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రులు త‌మ ప్ర‌సంగం లో పేర్కొన్నారు.