Begin typing your search above and press return to search.

ఈసారి శీతాకాల సమావేశాలకు రంగం సిద్దం.. హాట్ టాపిక్స్ ఇవే

By:  Tupaki Desk   |   26 Nov 2020 11:50 PM IST
ఈసారి శీతాకాల సమావేశాలకు రంగం సిద్దం.. హాట్ టాపిక్స్ ఇవే
X
ఎముకలు కొరికే చలిలో వేడి పుట్టించేలా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 30వ తేది సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ పేరిట నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నిరోజులు జరపాలనే అంశాన్ని సోమవారం జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.

డిసెంబర్ 5 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాల్లో 11 చట్టాల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక 3 కీలక బిల్లులు ఆమోదించుకోవాలని చూస్తోంది.

ఇక ఈసారి అసెంబ్లీని 3 రాజధానుల అంశం, స్థానిక సంస్థల ఎన్నికలు, అంతర్వేది ఘటన లాంటి అంశాలు కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో వాడివేడిగా వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసారి అసెంబ్లీ హోరెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరుఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇక కరోనా వేళ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే అంశాన్ని టీడీపీ భుజానికెత్తుకుంది. ఆ అంశాన్ని కూడా పార్టీ సభలో ప్రస్తావించి చర్చకు పట్టుబడట్టే అవకాశాలున్నాయి. అయితే కరోనా కారణంగా అసెంబ్లీ పనిదినాలను తగ్గించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.