Begin typing your search above and press return to search.

పాక్ న‌టి డేర్ చూశారా?

By:  Tupaki Desk   |   22 July 2017 2:40 PM IST
పాక్ న‌టి డేర్ చూశారా?
X
పాకిస్థాన్... మ‌న‌కు పొరుగు దేశ‌మే అయినా కూడా ఇస్లామిక్ చ‌ట్టాల‌ను అమ‌లు చేసేందుకు అక్క‌డ ఉగ్ర‌వాద సంస్థ‌లు ఎప్ప‌టినుంచో నానా యాగీ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆ దేశంలో మ‌హిళ‌ల‌పై పెద్ద ఎత్తున ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఇస్లామేత‌ర దేశాల్లోలా మ‌హిళ‌లు - యువ‌తులు త‌మ అభిప్రాయాల‌ను ధైర్యంగా బ‌య‌ట‌కు చెప్ప‌లేని ప‌రిస్థితులు అక్క‌డ నెల‌కొన్నాయి. అస‌లు బాలిక‌లు పాఠ‌శాల‌లు వెళ్లాలంటే కూడా నానా ఇబ్బందులు ప‌డాల్లి వ‌స్తోంది. హిజ్‌ బుల్ లాంటి ఉగ్ర‌వాద సంస్థ‌లు బాలిక‌ల విద్య‌కు నిర‌స‌న‌గా నానా బీభ‌త్సం చేయ‌డంలో భాగంగా అక్క‌డి ప‌లు పాఠ‌శాల‌ల‌ను ధ్వంసం చేసిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే.

అలాంటి పాకిస్థాన్‌ కు చెందిన న‌టి- మోడ‌ల్ అంజ‌లిక తాహిర్ ఇప్పుడు సింగిల్ పోస్ట్‌ తో పెను క‌ల‌క‌ల‌మే రేపింది. త‌న న్యూడ్ ఫొటోను ఆమె ఏకంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో ప్ర‌త్యక్ష‌మైన తాహిర్ న్యూడ్ ఫొటో ఇప్పుడు నిజంగానే వైర‌ల్‌ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్పదు. మహిళలపై తీవ్రమైన ఆంక్షలు ఉండే పాకిస్థాన్ లాంటి దేశాల్లో ఆమె ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. అంజలికా తండ్రి పాకిస్థానీనే అయినా... ఆమె తల్లి ఉక్రేనియన్. ఆమె ఎక్కువగా ఉక్రెయిన్ లోనే పెరిగింది. అందుకే ఇంత ధైర్యంగా న్యూడ్ ఫోజులు ఇచ్చిందని అంటున్నారు.

2016లో పాకిస్థాన్‌ లో జరిగిన పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచిన అంజలిక తాహిర్ ఆవెంటనే పాక్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. 'నా బాండ్ నా బరటీ' అనే చిత్రంలో కూడా నటించింది. తన పాపులారిటీ మరింత పెంచుకునేందుకే ఇలా నగ్న ఫోజులు ఇస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు తాహిర్ తీరుపై పాకిస్థాన్లోని మత చాందస వాదులు మండి పడుతున్నారు. దేశ సాంప్రదాయాలను మంటగలుపుతోందని ఆగ్రహంగా వ్య‌క్తం చేస్తున్నారు. మున్ముందు వీరి మూలంగా అంజలిక ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందో చూడాలి.