Begin typing your search above and press return to search.
ఫైజర్ వ్యాక్సిన్ కోసం ఆతృత.. బ్రిటన్ కు ఇండియన్ల క్యూ
By: Tupaki Desk | 3 Dec 2020 2:00 PM ISTఫైజర్ వ్యాక్సిన్ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యాక్సిన్ను వేయించుకోవాలని కొందరు డబ్బున్న భారతీయులు ఉత్సాహపడుతున్నారు. లక్షలు ఖర్చుపెట్టుకొని అయినా సరే బ్రిటన్ వెళ్లి ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ట్రావెల్ ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సిన్ను ఆమోదించగానే ట్రావెల్ ఏజెంట్లకు ఫోన్లు వస్తున్నాయట. వచ్చేవారం నుంచి బ్రిటన్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. ఈ నేపథ్యంలో భారతీయులు లండన్ వెళ్లి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. అయితే బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం వచ్చే విదేశీయుల కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రతి విదేశీయుడు తమ దేశంలో ఐదురోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని అదే రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది.
ఈ నెల 15 నుంచి ఆ నిబంధన అమల్లోకి రానున్నది. అయితే ఇండియా నుంచి వెళ్లిన వాళ్లకు బ్రిటన్ లో వ్యాక్సిన్ వేస్తారా లేదా అన్నవిషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయంపై బ్రిటన్ విదేశాంగ శాఖ నుంచి ప్రకటన రావాల్సి ఉన్నది. కానీ కొన్ని ట్రావెల్సంస్థలు మాత్రం ప్యాకేజీల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విమానాయాన సంస్థలు, బ్రిటన్ హోటళ్లతో చర్చలు జరుపుతున్నాయి. ఈ విషయంపై ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ సీఈవో నిషాంత్ మాట్లాడుతూ.. ‘ఇండియా పాస్ట్ పోర్ట్ హోల్డర్స్ కు బ్రిటన్ లో వ్యాక్సినేషన్ ఇస్తారా లేదా అన్న విషయం పై క్లారిటీ లేని మాట వాస్తవమే.
అయితే కచ్చితంగా విదేశీయులకు కూడా వ్యాక్సినేషన్ అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. మేము ఇప్పటికే లండన్ లోని పలు హోటల్ల నిర్వాహకులతో మాట్లాడాము. బ్రిటన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడగానే బుకింగ్స్ మొదలుపెడతాం’ అని చెప్పారు. వ్యాక్సిన్ రెడీ అయిందనగానే జనాలు విదేశానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారంటే కరోనా పై ప్రజల్లో ఎంత భయం ఉందో తెలుస్తోందని అంటున్నారు.