Begin typing your search above and press return to search.
94 యూట్యూబ్ చానళ్ల మీద బ్యాన్.. తేల్చిన కేంద్ర మంత్రి
By: Tupaki Desk | 22 July 2022 3:16 AM GMTగతానికి భిన్నంగా డిజిటల్ కు భారీ ఆదరణ లభిస్తోంది. టెక్ట్స్ లేదంటే వీడియో.. సోషల్ మీడియా.. విభాగం ఏదైనా పరిధి.. విస్తృతి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారి తీరు అంతకంతకూ పెరుగుతోంది.
పెరిగిపోతున్న డిజిటల్ మీడియాకు తగ్గట్లే.. వాటిపై నిఘా పెంచుతున్నా.. అవేమీ సరిపోవటం లేదు. తామర తంపలా పుట్టుకొస్తున్న నకిలీ ఖాతాల్ని.. దేశ ప్రయోజనాల్ని దెబ్బ తీసే వాటిపై బ్యాన్ వేటు వేస్తున్నారు. తాజాగా అలాంటి వాటికి సంబంధించిన లెక్క ఒకటి బయటకు వచ్చింది.
వైసీపీకి చెందిన అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు. కేంద్రం బ్యాన్ విధించిన యూట్యూబ్ చానళ్లు.. సోషల్ మీడియా ఖాతాలతో పాటు.. వెబ్ సైట్లకు సంబంధించి వివరాల్ని ఆయన కోరారు.
దీనికి కేంద్ర సమాచార.. ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వక సమచారం ఇచ్చారు. దీని ప్రకారం నకిలీ వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఐటీ యాక్టు 2020ను గత ఏడాది.. ఐటీ రూల్స్ 2021ను రూపొందించామని.. దీని ప్రకారం నిబంధనల్ని పాటించని డిజిటల్ కంటెంట్ పై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పారు.
నకిలీ వార్తల వ్యాప్తికి కట్టడి వేస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో కేంద్ర సమాచార.. ప్రసార మంత్రిత్వ శాఖ 2009 లో నిజ నిర్దారణ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. 2021-22 మధ్య కాలంలో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లను.. 19 సోషల్ మీడియా ఖాతాలను.. 747 యూఆర్ఎల్స్ పైనా బ్యాన్ విధించినట్లుగా పేర్కొన్నారు.
సోషల్ మీడియాతో పాటు అసత్య వార్తలకు సంబంధించి షేర్ అవుతున్న వీడియోలు.. ఇన్ఫోగ్రాఫిక్స్ పోల్స్ ను గుర్తించి వాటికి సంబంధించిన నిజమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేలా పని చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఉన్న పరిమితులతో పాటు.. త్వరలో సోషల్ మీడియాలో కంటెంట్ నియంత్రణ.. వాటిపై వెల్లువెత్తే అభ్యంతరాల్ని విచారించేందుకు ప్యానల్ ను ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్న విషయాన్ని పేర్కొన్నారు. మొత్తానికి డిజిటల్ కంటెంట్ మీద మరింత నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని చెప్పక తప్పదు.