Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా అనుపమ్ ఖేర్ ట్వీట్ ఫోటోలు

By:  Tupaki Desk   |   13 July 2016 3:18 PM GMT
హాట్ టాపిక్ గా అనుపమ్ ఖేర్ ట్వీట్ ఫోటోలు
X
తన వైరి పక్షాల మీద మాటల తూటాలు పేల్చటమే కాదు.. బలమైన వాదనతో ఉక్కిరిబిక్కిరి చేయటం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు అలవాటు. ఆయన చేసే ప్రసంగాలు వాడి.. వేడిగా ఉండటమే కాదు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చను రేపేలా ఉంటాయి. బలమైన ఉదారవాదాన్ని వినిపిస్తారని కొందరు ఆయన్ను వెనకేసుకొస్తే.. మరికొందరు మాత్రం ఆయనదంతా బీజేపీ అనుకూల వాణి అని ఆడిపోసుకుటారు. అయితే.. అనుపమ్ ను అభిమానించేవారు మాత్రం.. ఆయన మాటలన్ని అక్షర సత్యాలుగా అభివర్ణిస్తూ.. అనుపమ్ మాదిరి నిజాయితీగా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారు చాలా అరుదుగా పొగిడేస్తుంటారు.

ఆ మధ్యన ఒక బహిరంగ సభలో కాంగ్రెస్ నేతల్ని చీల్చి చెండాడేయటమే కాదు..మేధావులన్న ట్యాగ్ లైన్ వేసుకొని తిరిగేవారిని ఉతికి ఆరేసిన అనుపమ్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. చిన్నా.. పెద్దా .. ఆడా.. మగా అన్న తేడా లేకుండా నిర్దిక్ష్యిణ్యంగా దాడులు జరిగాయన్న వాదనకు సాక్ష్యంగా కొన్ని ఫోటోల్ని పోస్ట్ చేశారు. కశ్మీరీపండిట్లను లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు చంపేసిన మృతదేహాల్ని పోస్ట్ చేసిన ఆయన.. సూడో లిబరల్స్ ఎవరూ ఇలాంటి అంశాల మీద స్పందించరే అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కశ్మీర్ ఎంతగా రగిలిపోతుందో తెలిసిందే. 22 ఏళ్ల కశ్మీరీ టెర్రరిస్ట్ ను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ.. భారీ ఎత్తున హింస చెలరేగుతున్న వేళ.. హిందూ పండిట్ల కుటుంబాల్ని టెర్రరిస్టులు దారుణంగా చంపేసిన గతంలో చోటు చేసుకున్న వైనాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలన్నీ భావోద్వేగాల్ని తట్టి రేపేలా ఉండటం గమనార్హం. ఫోటోల్ని చూసినంతనే మనసు చివుక్కుమనేలా ఉన్నవీటిని పలు మీడియా సంస్థలు ప్రచురించేందుకు ఇష్టపడటం లేదు. తాజా ఫోటోలతో అనుపమ్ ఖేర్..కశ్మీర్ లోయలో జరిగే అన్ని సంఘటనలకు ఒకేరీతిలో స్పందించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగాచెప్పొచ్చు.