Begin typing your search above and press return to search.

చోక్సీ కిడ్నాప్ పై ఆంటిగ్వా రాయల్ ఫోర్స్ విచారణ… ప్రధాని బ్రౌన్ కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   7 Jun 2021 10:30 AM GMT
చోక్సీ కిడ్నాప్ పై ఆంటిగ్వా రాయల్ ఫోర్స్ విచారణ… ప్రధాని బ్రౌన్ కీలక వ్యాఖ్యలు !
X
ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ని డొమినికాకు కిడ్నాప్ చేశారంటూ మెహుల్ చోక్సీ తరఫు లాయర్లు దాఖలు చేసిన ఫిర్యాదుపై ఆంటిగ్వా, బర్మూడా రాయల్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని ప్రధాని గెస్టన్ బ్రౌన్ తెలిపారు. ఈ కిడ్నాపింగ్ వ్యవహారం నిజమే అయితే ఇది సీరియస్ మ్యాటర్ అని చెప్పారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందొ లాయర్లు వివరించారని, ఆ జాబితాను పోలీస్ కమిషనర్ కు అందజేశారని ఆయన చెప్పారు. తనను అపహరించుకుపోయారని చోక్సీ కూడా ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు.

పోలీసులు అన్ని అంశాలను సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్టు తెలిపారు. కాగా, చోక్సీ గత నెల 23 సాయంత్రం 5 గంటలవరకు ఆంటిగ్వా లోనే ఉన్నారని, ఇక్కడి నుంచి డొమినికా వెళ్లాలంటే 12 నుంచి 13 గంటలు పడుతుందని, కానీ నాలుగైదు గంటల్లో అక్కడికి ఎలా వెళ్తారని ఆయన కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. ఆంటిగ్వా నుంచి డొమినికా 120 మైళ్ళ దూరంలో ఉందన్నారు. కాగా ఆంటిగ్వా లోని జోలీ హార్బర్ నుంచి తమ క్లయింటును ఆంటిగ్వా, ఇండియన్ పోలీసులు బోటులో కిడ్నాప్ చేశారని చోక్సీ లాయర్లు అంటున్నారు. దీనితో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇలా ఉండగా తాను చట్టానికి కట్టుబడి ఉంటానని, చట్టాన్ని గౌరవిస్తానని చోక్సీ డొమినికా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపారు. అమెరికాలో వైద్య చికిత్స కోసం తను ఇండియా నుంచి నిష్క్రమించానని, తనను భారతీయ అధికారులు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయవచ్చునని ఆయన ఇందులో పేర్కొన్నారు. ఇండియాలో నేను చట్టం బారి నుంచి తప్పించుకోలేదు అని ఆయన అన్నారు. ఇన్ని చెబుతున్న ఆయన తనను కిడ్నాప్ చేసేందుకు అవతలివారు హానీ ట్రాప్ వేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఈయన కిడ్నాపింగ్ వ్యవహారంలో ఓ మహిళ కీలక పాత్ర పోషించిందని వార్తలు లోగడే వచ్చాయి.