Begin typing your search above and press return to search.

బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ పై యాంటీబాడీస్ స్పందన.. నిపుణుల మాటేంటి?

By:  Tupaki Desk   |   25 Jan 2022 7:38 AM GMT
బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ పై యాంటీబాడీస్ స్పందన.. నిపుణుల మాటేంటి?
X
కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ శక్తివంతమైన మార్గం అని వైద్యారోగ్య నిపుణులు ఆది నుంచి చెబుతూనే ఉన్నారు. కాగా మన దేశంలో టీకా ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పుడు మూడో డోసును కూడా అందిస్తున్నారు ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రికాషన్ మోతాదును తీసుకుంటున్నారు. అయితే టీకా పొందిన తర్వాత కూడా కొందరు వైరస్ బారిన పడుతున్నారు. దీనినే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ గా చెబుతున్నారు.

అయితే ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లపై యాంటీ బాడీల స్పందన మెరుగ్గా ఉందని తెలుస్తోంది.టీకా పొందిన తర్వాత వైరస్ సోకిన వారిలో యాంటీబాడీల స్పందన మెరుగ్గా ఉందని అమెరికా శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో వెల్లడైంది. మూడు సార్లు టీకా తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నట్లు వారు గుర్తించారు. అంతేకాకుండా కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత టీకా పొందిన వారిలోనూ అదే స్థాయిలో యాంటీ బాడీలు ఉన్నట్లు తెలిపారు..

కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత టీకా తీసుకున్నవారు, మూడు సార్లు వ్యాక్సిన్ తీసుకున్న వారిపై అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. అయితే ఈ ఇద్దరిలోనూ ఒకే స్థాయిలో యాంటీబాడీలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు.

సహజంగా కరోనా వైరస్ లో ఉన్న కొన్ని లక్షణాలు టీకా ప్రభావం తగ్గించగలవు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లలోనూ ఇవి ఉన్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గించి... శరీరంలోని రోగ నిరోధక శక్తిని కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా టీకా సామర్థ్యం కూడా రోజురోజుకు తగ్గిపోతుంటంది.

ఈ నేపథ్యంలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అయితే వారిలో రోగ నిరోధక శక్తి మెరుగవుతోందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తిస్థాయి ఆరోగ్యవంతుల్లో కనీస లక్షణాలు కూడా ఉండడం లేదని చెప్పారు. కరోనా తర్వాత టీకా తీసుకున్న వారు, మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని పోల్చి చూశామని వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్నవారు, మూడు టీకాలు తీసుకున్న వారు బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కు గురైతే.. వైరస్ తీవ్రత, యాంటీబాడీల స్పందన ఒకేలా ఉన్నట్లు గుర్తించినట్లు అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా తీసుకుని... వైరస్ బారిన పడిన వారిలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. కాగా కరోనా కేసులు ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే తీవ్రత మాత్రం తక్కువగానే ఉంటోంది. మరణాల రేటు చాలా తక్కువగా ఉందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. మనదేశంలోనే కాదు చాలా దేశాల్లోనూ మరణాలు తక్కువే నమోదవుతున్నాయి. అయినా కూడా అప్రమత్తత అవసరం అని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.