Begin typing your search above and press return to search.
మోడీ బర్త్ డే రోజు అంత వ్యతిరేకతనా?
By: Tupaki Desk | 18 Sept 2020 5:40 PM ISTమోడీ అంటేనే నవతరం నేత.. సోషల్ విప్లవం తెచ్చిన నాయకుడు. సోషల్ మీడియాను మోడీ వినియోగించినంతగా ఎవరూ వినియోగించలేదనే టాక్ ఉంది. లాక్ డౌన్లోనూ మోదీ సోషల్ మీడియాను వాడినంతగా మరే నేత కూడా ఉపయోగించలేదంటే అతిశయోక్తి కాదేమో.. తాజాగా మోదీకి సోషల్ మీడియాలో నిరసన సెగ తాకడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.
నిన్న ప్రధాని మోడీ పుట్టినరోజు. దేశ విదేశాల నుంచి మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.మోదీ 70వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో #Happy Birthday PM Modi హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. కానీ అంతలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక ట్వీట్ పెట్టాడు. ‘జాతీయ నిరుద్యోగ దినం’ అంటూ మోడీ బర్త్ డేనాడు హ్యాష్ ట్యాగ్ పెట్టి మోడీని దెప్పిపొడిచాడు..
ఇక అంతే.. రాహుల్ గాంధీ పెట్టిన ఆ ట్వీట్ కు విశేష స్పందన వచ్చింది. మోడీకి ట్విట్టర్ లో విషెస్ కంటే వ్యతిరేక కామెంట్స్ వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ సోషల్ మీడియా అంతా అనుకూల ట్వీట్స్ చేసిన వారంతా మోడీకి వ్యతిరేకంగా తయారై నిరుద్యోగులకు ఏం చేయడం లేదంటూ మోడీపై కామెంట్స్ చేశారు.
సోషల్ మీడియాలో ఇంతమంది మోడీకి వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు.‘నేషనల్ అన్ ఎంప్లాయ్‌మెంట్ డే (జాతీయ నిరుద్యోగ దినోత్సవం)’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగులోకి తీసుకొచ్చారు. గురువారం ఒక్కరోజే దీనికి 16లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. ‘హ్యాపీ బర్త్‌డే పీఏం మోదీ’ అనే హ్యాష్ ట్యాగ్ కంటే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లే ఎక్కువగా ఉన్నాయట.
సోషల్ మీడియా పవర్ ఏంటో ఇప్పుడు మోడీకి తెలిసి వచ్చిందంటున్నారు. నచ్చితే నెత్తిన పెట్టుకోవడమే కాదు.. వ్యతిరేకిస్తూ అదేవిధంగా స్పందిస్తారని మోడీ బర్త్ డే సందర్భంగా రుజువైందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ మధ్య మోడీ మీద సోషల్ మీడియాలో కొంచెం వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. ఆయనను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ వాళ్లే అంటున్నారు. కరోనా లాక్ డౌన్ లో మోడీ ప్రజలకు, నిరుద్యోగులకు, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఏం చేయలేదన్న ఆగ్రహమే మోడీకి సెగ తగిలేలా చేస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.