Begin typing your search above and press return to search.

కేసీఆర్ డౌన్.. డౌన్‌.. తూర్పులో ఏంటీ ర‌గ‌డ‌?

By:  Tupaki Desk   |   5 Jan 2023 6:00 AM IST
కేసీఆర్ డౌన్.. డౌన్‌.. తూర్పులో ఏంటీ ర‌గ‌డ‌?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగిడిన చోట‌.. ఇప్పుడు తెగుడుతున్నారు. ఏపీలో అడుగు పెట్ట‌నున్న బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌కు తీవ్ర వ్య‌తిర‌క‌త వ్య‌క్త‌మైంది. ఉమ్మ‌డితూర్పు గోదావ‌రి జిల్లాలో ఒక‌ప్పుడు.. కేసీఆర్ ఫ్లెక్సీల‌కు దండ‌లు వేసి.. దండాలు పెట్టిన ప్ర‌జ‌లు.. ఇప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఫ్లెక్సీలు క‌ట్టారు. ముఖ్యంగా త‌ణుకులో కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా.. అవ‌మాన‌క‌రంగా ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. అంతేకాదు.. కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలు కూడా క‌నిపిస్తున్నాయి.

మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే.. కాపుల‌ను బీఆర్ ఎస్‌లోకి చేర్చుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపు నాయ‌కులు, వారి ఓటు బ్యాంకు కూడా భారీగానే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కాపు నాడు నాయ‌కులు, మెగా ఫ్యాన్స్ కూడా ఇప్ప‌టికే తీర్మానాలు చేసుకున్నాయి. ఖ‌చ్చితంగా ప‌వ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

కానీ, ఇంత‌లోనే కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా బీఆర్ ఎస్‌లోకి కాపు నేత‌ల‌ను తీసుకోవ‌డం.. వారికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం.. కాపుల‌ను పార్టీలోకి ఆహ్వానించ‌డం.. వంటివి స‌హ‌జంగానే కాపు నాయ‌కుల‌ను మంటెత్తేలా చేశాయి. అయితే.. వీరు ఆ పార్టీకి వ్య‌తిరేకం కాదు.. బీఆర్ ఎస్ పార్టీని ఇప్ప‌టికీ స్వాగ‌తించే ప‌రిస్థితి ఉంది. కానీ, బీఆర్ ఎస్ పేరుతో జ‌న‌సేన ఓట్ల‌ను చీల్చుతున్నార‌ని..కాపుల‌ను ప‌వ‌న్‌కు దూరం చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున ఉమ్మ‌డి జిల్లాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోనే ఆవేశానికి గురైన కొంద‌రు యువ‌కులు కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఇలాంటి ఫ్లెక్సీలు క‌డుతున్నారు. అదేస‌మ‌యంలో హైద‌రాబాద్‌ను దోచుకున్న వారు.. అంటూ.. తీవ్ర‌వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిని చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రం కేసీఆర్‌పైనే ఉంది. లేక‌పోతే.. బీఆర్ ఎస్ నేత‌లు.. గ‌డ‌ప కూడా దాటే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.