Begin typing your search above and press return to search.

మాతృభాషపై మమకారం.. హిందీపై యుద్ధం

By:  Tupaki Desk   |   8 Sept 2020 2:20 PM IST
మాతృభాషపై మమకారం.. హిందీపై యుద్ధం
X
అమ్మభాష.. ఎవరికైనా దాని మీద ప్రేమ ఉంటుంది. అమ్మనూ మరిచిపోము.. మన భాషను ఏ దేశమేగినా మరవము.. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషపై ప్రేమ అంతగా ఉండదు. ఎందుకంటే తెలంగాణలో హిందీ విరివిగా మాట్లాడుతారు. ఏపీలో ఏకంగా ఆ సర్కార్ ఇంగ్లీష్ మీడియం చదువులనే పెడుతున్నారు.

కానీ మన పక్కనున్న తమిళులు మాత్రం అలా కాదు.. వారికి భాష అమ్మకంటే ఎక్కువ. తమిళంను అవమానిస్తే ఉద్యమాలే చేసిన చరిత్ర వారిసొంతం.

ఇటీవల వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో తమిళనాట మళ్లీ హిందీ భాషపై యుద్ధం మొదలైంది. తమిళంను నీరుగారుస్తూ హిందీని కేంద్రప్రభుత్వం, బీజేపీ రుద్దుతోందంటూ హిందూ ఉద్యమాన్ని ప్రతిపక్ష డీఎంకే చేపట్టింది.

తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. కొందరు సినీ సెలెబ్రెటీలు, యువత ‘హిందీ తెలియదు పోరా’ అంటూ టీషర్టులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. అదే సమయంలో ‘హిందీ నేర్చుకుంటే తమిళం కాదు.. డీఎంకే గల్లంతు’ అని బీజేపీ యువత దాడికి దిగుతోంది. దీంతో ఇప్పుడు తమిళ అభిమాన పార్టీలు, బీజేపీ మధ్య సమరానికి ఇది దారితీస్తోంది.

ఇటీవల హిందీ, సంస్కృతం విషయంగా కేంద్రం పలు సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలతో పోరాటాలు భగ్గుమన్నాయి. తాజాగా కేంద్రం త్రిభాష విధానంతో హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దే యత్నం చేస్తున్నట్టు తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దీంతో హిందీకి వ్యతిరేకంగా సినీ సెలెబ్రెటీలు యువన్ శంకర్ రాజా, ఐశ్వర్య, శంతను, నటుడు, డీఎంకే యువనేత ఉదయనిధి టీషర్టులపై హిందీ వ్యతిరేక నినాదం ముద్రించుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సోషల్ మీడియా ఉద్యమానికి ఎంపీ కనిమొళి సారథ్యం వహిస్తున్నారు. యువత, సెలెబ్రెటీలు, తమిళులంతా ఇప్పుడు ఇదే ఉద్యమాన్ని తమిళనాట హోరెత్తిస్తున్నారు.