Begin typing your search above and press return to search.

'సాక్షి' లో యాంటీ గవర్నమెంట్ వార్త.. మంచిదే!

By:  Tupaki Desk   |   23 Sep 2019 8:49 AM GMT
సాక్షి లో యాంటీ గవర్నమెంట్ వార్త.. మంచిదే!
X
పై వార్తను గమనించండి. ప్రకాశం జిల్లాకు సంబంధించిన వార్త. కంభం-గిద్దలూరు ఆర్ అండ్ బీ రోడ్డు అద్వానరీతిలో ఉందని - ఆ రోడ్డు చాలా దారుణంగా ఉండటంతో ప్రయాణిస్తున్న వారి ఇక్కట్ల గురించి వివరిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది ‘సాక్షి’.

సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత వార్తా సంస్థ ఇది అని వేరే చెప్పనక్కర్లేదు. ఇలా జగన్ సొంత పత్రికలో - ఆయన పార్టీ అధికారంలో ఉన్న వేళ ఇలా యాంటీ గవర్నమెంట్ వార్త ప్రచురితం అయ్యింది. ఇది ఆహ్వానించదగిన అంశమే. ఎంతసేపూ ప్రభుత్వం గురించి.. ఆహా..ఓహో.. వార్తల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండకపోవచ్చు.

అధికార పార్టీకి అనుకూలంగా - అధికార పార్టీకి సొంత పత్రికలో ఇలాంటి వార్తలు రావడం వల్ల… సదరు సమస్యలు మరింత వేగవంతంగా పరిష్కారం కావొచ్చు. ప్రజా సమస్యల గురించి పత్రికలు ప్రతిపక్ష పాత్రనే పోషించాలి. అప్పుడు అధికార పార్టీ అలర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది.

అంతిమంగా పత్రికల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన రావడం వల్ల.. మేలు జరిగేది ప్రభుత్వానికే. ఆ సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కరిస్తే.. ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. రాజకీయ వార్తల సంగతెలా ఉన్నా.. ప్రజా సంబంధ, ప్రజా సమస్యల సంబంధ వార్తల విషయంలో మాత్రం జగన్ సొంత పత్రిక ఈ తరహాలో వ్యవహరించడమే మంచిదనేది పరిశీలకుల అభిప్రాయం.