Begin typing your search above and press return to search.

సీఏఏపై నిరసనకు వాంఖడేలో ప్రజాతీర్పు వచ్చేసింది

By:  Tupaki Desk   |   15 Jan 2020 10:59 AM IST
సీఏఏపై నిరసనకు వాంఖడేలో ప్రజాతీర్పు వచ్చేసింది
X
సున్నితమైన అంశాల్ని.. వివాదాస్పద విషయాల్ని అదే పనిగా నాన్చకుండా.. వరుస పెట్టి నిర్ణయాలు తీసుకునే ధైర్య సాహసాలు ప్రధాని మోడీలో పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆయన సర్కారు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా చెప్పాలి. ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా విపరీతమైన ప్రజా మద్దతు లభిస్తున్న వేళ.. విపక్షాలు సైతం మౌనంగా ఉండే పరిస్థితి. ఇలాంటివేళ.. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారీ ర్యాలీల్ని నిర్వహిస్తున్నారు.

మోడీ జోరుకు సీఏఏ బ్రేకులు వేసిందన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం.. మీడియాలోనూ అలాంటి తీరే కనిపిస్తున్న వేళ.. ప్రజాస్పందన మరోలా ఉందా? అన్న భావన కలిగేలా ఒక ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. మూడు వన్డే సిరీస్ లో బాగంగా భారత్.. ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్ కు కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కొందరు నిరసనకారులు టీషర్టుల మీద ఇంగ్లిషు అక్షరాల్ని వేసుకొని స్టేడియంలోకి వచ్చారు. నో ఎన్ ఆర్ సీ అని రాసి ఉన్న టీ షర్టలను వారు ధరించారు. అంతేకాదు.. చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం షురూ చేయటం స్టార్ట్ చేశారు.

ఇలాంటి వేళ.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. స్టేడియంలో ఉన్న వారంతా నో ఎన్ ఆర్ సీకి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలకు కౌంటర్ ఇస్తూ.. మోడీ.. మోడీ అని నినాదాలు చేయటం.. అది స్టేడియం మొత్తం పాకి.. నిరసనకారుల వాయిస్ వినిపించకుండా పోయేలా చేసింది. ఎన్ఆర్ సీ విషయంలో బయట కనిపిస్తున్న నిరసనలకు భిన్నంగా ప్రజా సమూహం మాత్రం చట్టానికి అనుకూలంగా ఉన్నామన్న విషయం వాంఖడే స్టేడియం సాక్షిగా చెప్పేశారని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్ ఆర్ సీని వ్యతిరేకించేవారంతా.. ప్రజా స్పందనను కాస్త చూస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.

వీడియో కోసం క్లిక్ చేయండి